ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన టమాటా; ఏపీ, తెలంగాణాలో ధరలిలా!!

టమాటా ధర కిందికి దిగడం లేదు. ఆగస్టు నెలలో టమోటా ధరలు కిందికి దిగుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ, తెలంగాణాలో టమాటా ధర ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో టమాటా ధర కిలోకు 200 రూపాయల రికార్డు ధర పలికింది. తెలంగాణ రాష్ట్రంలోనూ టమాటా ధర ఏకంగా 200 రూపాయలు పలికింది.

నిన్న మొన్నటి వరకు 120 రూపాయలు ఉన్న టమాటా ధరను, టమాటా లకు డిమాండ్ ఎక్కువ ఉండడంతో, దొరకడం లేదన్న సాకు చూపి 200 రూపాయలకు అమాంతం పెంచేశారు. దీంతో కిలో 200 రూపాయలు పెట్టి టమాటాలను కొనుగోలు చేయాలంటే కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. సామాన్యులైతే టమాటాల వంక చూసేదే లేదు.

 Tomato Price All time record; these are the Prices in AP and Telangana!!

ఇటీవల కాలంలో కురిసిన విపరీతమైన వర్షాలు టమాటా దిగుబడులపై ప్రభావం చూపడంతో పాటు డిమాండ్ కు తగినట్టుగా టమాటాల సరఫరా లేకపోవడంతో ప్రస్తుతం టమాటా ధరలు ఆల్ టైం రికార్డ్ ను సృష్టిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ టమాటా మంట మండిపోతుంది. టమాటాలను సాగు చేసిన రైతులు లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతుంటే జనాలు మాత్రం టమాటాలను చూసి భయపడుతున్నారు.

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్ టమాటాలకు ఫేమస్. అయితే మదనపల్లె మార్కెట్ కు తక్కువ మొత్తంలో టమాటాలు రావడంతో ధర పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మదనపల్లె ప్రాంతంలో టమాటాల సీజన్ చివరి దశ కావడంతో పాటు, బయట ప్రాంతాల నుంచి దిగుబడి లేకపోవడంతో ధరలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయని తెలుస్తుంది.

ఇటు తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టమాటాలు తక్కువగా మార్కెట్ కు వస్తున్న పరిస్థితులు, వర్షాలకు టమాటా దెబ్బతిన్న పరిస్థితులు వెరసి టమాటాల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా టమాటా కు గిరాకీ ఎక్కువగా ఉండడంతో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గడ్ కు చెందిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మకాం వేసి టమాటాలను కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+