Tomato Prices: అక్కడ టమాటాల కోసం కిలోమీటర్ల మేర జనాల బారులు.. కారణమిదే!!

ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ఏ రాష్ట్రంలో చూసినా కూడా విపరీతంగా పెరిగిన టమాటాల ధరలే ఒక హాట్ టాపిక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టమాటాల ధరలు విపరీతంగా ఉన్నవేళ ఎవరైనా టమాటలను కొనుగోలు చేస్తున్నారంటే వారు బాగా రిచ్ అన్నట్టుగా చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టమాటా ధరలను తగ్గించడం కోసం ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ప్రస్తుతం మాత్రం ధరలు ఇంకా నియంత్రణలోకి రాలేదు.

దీంతో వంటింట్లో టమాటాలకు బదులు ప్రత్యామ్నాయం వెతకలేక మహిళలు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా తక్కువ ధరకు టమాటాలు దొరుకుతున్నాయి అంటే అక్కడికి వెళ్లి నానా ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర బారులు తీరి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక అక్కడ కూడా దొరకకపోతే వారి బాధ వర్ణనాతీతం.

In AP, tomatoes are being offered at subsidized prices in rythu bazar for Rs 48 only. Today People queue lines for 2 kilometers for subsidy Tomatoes in kadapa rythu bazar in AP.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు టమాటాలను విక్రయిస్తున్న క్రమంలో, టమాటాలను కొనుగోలు చేయడానికి జనాలు ఎగబడుతున్నారు. ఇదిలా ఉంటే నేడు కడప రైతు బజార్ వద్ద ఉదయం నుండే దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రజలు క్యూలైన్లో నిలబడి టమాటాలను కొనుగోలు చేశారు.

బయట మార్కెట్లో టమాటాల ధరలు 150 రూపాయలకు పైగా అమ్ముతుంటే, రైతు బజార్లలో టమాటాలు ధరలను 48 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రైతు బజార్లలో టమాటాలను కొనుగోలు చేయడానికి జనాలు నానా చావు చస్తున్నారు. అయితే ఇక్కడ కూడా టమాటాలు దొరకడం లేదని, అధికారులు, పరిచయస్తులకు మాత్రమే వీటిని విక్రయిస్తున్నారని, టమాటాలు పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో అనేక చోట్ల గ్రామీణ ప్రాంతాలలో టమాటాలు ధరలు 150 రూపాయలకు విక్రయిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో కిలో 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇక ఇదే అదునుగా టమాటాల బ్లాక్ మార్కెట్ కూడా జోరుగా సాగుతుంది. దీంతో అసహనంతో ఉన్న ప్రజలు పాలకులు త్వరితగతిన టమాటా ధరలను సాధారణ స్థాయికి తీసుకురండి మహా ప్రభో అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+