భారీగా తగ్గిన టమోటా ధర, ప్రస్తుతం - కానీ అక్కడ మాత్రం..!!

టమోటా ధరలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలోని పలుచోట్ల టమాట ధరలు తగ్గాయి. ఇక ఒకటి, రెండు రోజుల్లో కిలో టమాట రూ.200 దాటిన పరిస్థితుల్లో టమాట సామాన్యులు, పేదలను కరుణించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో కిలో టమాట రూ.64కు లభిస్తోంది. కానీ, కొన్ని నగరాలు, పట్టణాల్లోని రిటైల్ మార్కెట్ లో మాత్రం ఇంకా కిలో ధర రూ 100 వరకు విక్రయాలు సాగిస్తున్నారు.

మదనపల్లె ప్రాంతంలో టమోటా ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి. పది రోజుల వ్యవధిలో ఏకంగా కిలో రూ 200 నుంచి కిలో రూ 64కి దిగి వచ్చింది. గత నెల చివరి రెండు వారాల్లో కిలో టమోటా ధర రూ 100 నుంచి రూ 200 వరకు కొనసాగింది. నిత్యం మార్కెట్ కు 200 నుంచి 350 టన్నుల టమోటాలు విక్రయానికి వచ్చేవి ఈ క్రమంలో ఆగస్టు నెలలో పది రోజులు గడిచే సరికి దిగుబడులు పెరగటంతో ధరల్లో పతనం మొదలైంది. గురువారం మదనపల్లె మార్కెట్ లో మొదటి రకం టమోటా గరిష్ఠంగా కిలో రూ 64 పలకగా, రెండో రకం టమోటా కనిష్టంగా రూ 36 పలికింది.

Tomato retail prices drop to rs 67 per kg with higher supply of new crops other states

అనంతపురం ప్రాంతంలో టామోటా దిగుబడులు పెరిగి పెద్ద ఎత్తున సరుకు రావటంతో మదనపల్లె మార్కెట్ లో ధరలు దిగివిచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్ లో ఇంకా అధిక ధరలకే విక్రయాలు సాగుతున్నాయి. ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో తాము కొనుగోలు చేసామంటూ బయట మాల్స్‌, షాపుల్లో కిలో టమాట రూ.120దాకా విక్రయిస్తున్నారు. ఒకటి రెండు రోజులుగా రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు టమాట పంట రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు 850 క్వింటాళ్ల టమాట మాత్రమే వచ్చింది. ధరలు తగ్గుతుండటంతో తిరిగి వేల క్వింటాళ్ల టమాట హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చింది.

వర్షాలు తగ్గటం, మార్కెట్ కు పెద్ద మొత్తంలో టమోటా రావటంతో ధరలు తగ్గు ముఖం పట్టాయి. హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచే అధికంగా టమాట వస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని జిల్లాల నుంచి కూడా టమాట ఎక్కువగానే వస్తోంది. ఆగస్టు నెల ఆఖరు నాటికి కిలో ధర 50కు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు బజార్లలో ప్రస్తుత ధర రూ 50 వరకు ఉంది. గ్రేడ్ ల వారీగా టమోటాల అమ్మకాలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+