వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్న‌దాత సుఖీభ‌వ‌కు 5వేల కోట్లు : స‌ంక్షేమానికి భారీ నిధులు : నిరుద్యోగ భృతి రెండు వేల‌కు పెంపు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల ముందు ఏపి ప్ర‌భుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌లో కొత్త వ‌రాలు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఆలోచ‌న‌గా ఉన్న ప‌ధ‌కాల‌కు ఈ బ‌డ్జెట ద్వారా ఆచ‌ర‌ణ రూపంలో తీసుకొచ్చేందుకు నిర్ణ‌యించారు. అందులో భాగంగా అన్న‌దాత సుభీ భ‌వ‌.. నిరుద్యోగ భృతి పెంపు. కొత్త‌గా 11 బిసి కార్పోరేష‌న్ల ఏర్పాటు ను ప్ర‌క‌టించారు.

అన్న‌దాత సుఖీభ‌వ‌కు 5 వేల కోట్లు..

అన్న‌దాత సుఖీభ‌వ‌కు 5 వేల కోట్లు..

2019-20 ఆర్దిక సంవ‌త్స‌రానికి సంబంధించి ఎన్నిక‌ల ముందు ఏపి ప్ర‌భుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిం ది. అందులో ప్ర‌ధానంగా ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కీల‌న నిర్ణ‌యాల‌ను బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించింది. అందులో భాగం గా ఇప్ప‌టి వ‌ర‌కు ఆలోచ‌న‌గా ఉన్న అన్న‌దాత సుఖీభ‌వ కార్య‌క్రమానికి అయిదు వేల కోట్లు బ‌డ్జెట్‌లో కేటాయిస్తూ నిర్ణ యం ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రైతు రుణ విముక్తి కోసం 24 వేల కోట్లు ఖ‌ర్చు చేసామ‌ని..పెండింగ్ లో ఉన్న చివ‌రి రెండు విడ‌త‌ల రుణ మాఫీ త్వ‌రలోనే విడుద‌ల చేస్తామ‌ని య‌న‌మ‌ల ప్ర‌కటించారు. అదే విధంగా 94 ల‌క్ష‌ల మంది డ్వాక్రా మ‌హిళ‌ల‌కు గ‌తంలో 10 వేల చొప్పున ఇచ్చామి..ఇప్పుడు మ‌రో సారి మూడు విడ‌త‌లుగా ఒక్కో స‌భ్యురాలికి ప‌ది వేల చొప్పున అందిస్తున్నామ‌ని వివ‌రించారు.

జ‌య‌హో బిసి ప్ర‌క‌ట‌న‌ల‌కు ప్రాధాన్య‌త‌..

జ‌య‌హో బిసి ప్ర‌క‌ట‌న‌ల‌కు ప్రాధాన్య‌త‌..

ఇక‌, కొద్ది రోజుల క్రితం ఏపి ప్ర‌భుత్వం నిర్వ‌హించిన జ‌య‌హో బిసి స‌భ‌లో ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న ల‌కు అనుగుణంగా కొత్త నిర్ణ‌యాల‌ను బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించారు. ఈ నాలుగున్నారేళ్ల కాలంలో ఎస్సీల‌కు 32,483 కోట్లు, ఎస్టీల‌కు 8,950 కోట్లు, బీసిల‌కు 28,805 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు వివ‌రించారు. కొత్త‌గా 11 కార్పోరేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 8 ఫెడ‌రేషన్ల‌ను కార్పోరేష‌న్లుగా తీర్చి దిద్దుతున్నామ‌ని వెల్ల‌డించారు. బిసీ కార్పోరేష‌న్ల‌కు ఈ సారి బ‌డ్జెట్‌లో 3 వేల కోట్లు ప్ర‌తిపాదించారు. కాపుల సంక్షేమానికి వెయ్యి కోట‌లు, బ్రాహ్మ‌ణుల సంక్షేమానికి 100 కోట్లు, ఆర్య‌వైశ్యుల కోసం 50 కోట్లు, క్ష‌త్రియుల సంక్షేమానికి 50 కోట్లు ప్ర‌తిపాదించారు. అదే విధంగా మైనార్టీల సంక్షేమం కోం 1304 కోట్లు కేటాయిస్తున్న ట్లుగా య‌న‌మ‌ల ప్ర‌క‌టించారు.

సంక్షేమ రంగానికి భారీగా నిధులు

సంక్షేమ రంగానికి భారీగా నిధులు

ఇక‌, సంక్షేమ రంగానికి ఈ బ‌డ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. దివ్యాంగు సంక్షేమానికి 70 కోట్లు, ఎస్సీ స‌బ్ ప్లాన్ కింద 14,367 కోట్లు, ఎస్టీ స‌బ్ ప్లాన్ కు 5385 కోట్లు, బిసి స‌బ్ ప్లాన్ కు 16,226 కోట్లు కేటాయించారు. కొత్త‌గా డ్రైవ‌ర్ల సాధికారి క సంస్థ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ సంస్థ‌కు 150 కోట్లు ప్ర‌తిపాదించారు. అదే విధంగా ఎన్టీఆర్ భ‌రోసా కిం ద ఇస్తున్న 50.11 ల‌క్ష‌ల మందికి ఇస్తున్న పెన్ష‌న్ల కోం నాలుగేళ్ల కాలంలో 24,618 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు వివ‌రించారు. ఇక‌, నిరుద్యోగ భృతి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వెయ్యి రూపాయాల నుండి వ‌చ్చే ఆర్దిక సంవ‌త్స‌రం నుండి రెండు వేల‌కు పెంచుతున్న‌ట్లుగా ఆర్దిక మంత్రి య‌న‌య‌ల ప్ర‌క‌టించారు.

English summary
For year 2019-20 Ap Govt submitted vote on account budget in Assembly to day. Govt given top priority for Farmer and welfare. New scheme announced for farmers. Welfare budget hike and Nirudyoga Bruthi doubled in Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X