TTD: నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్త!
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు, టీటీడీ అనుబంధ వ్యవస్థలను కూడా బలోపేతం చేస్తున్నటువంటి టిటిడి తాజాగా నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త చెప్పింది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయడానికి టిటిడి కసరత్తును ప్రారంభించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో టిటిడి ఈ మేరకు కీలక నిర్ణయాలను తీసుకుంది.
స్విమ్స్ ఆస్పత్రిలో సిబ్బంది నియామకాలు
స్విమ్స్ ఆస్పత్రి, ఇంజనీరింగ్ విభాగంతో పాటు దేవస్థానంలోని ఇతర ఖాళీలను భర్తీ చేయడం పైన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో జరిపిన చర్చలో భాగంగా ఉద్యోగాల భర్తీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా స్విమ్స్ ఆసుపత్రిలో 128 మంది పారా మెడికల్ సిబ్బందితోపాటు, రిజిస్ట్రార్ స్థాయి అధికారులను నియమించాలని ఇప్పటికే అనేక మార్లు చర్చలు జరగగా, తాజాగా జరిగిన చర్చలు త్వరితగతిన నియామకాలు చేపట్టాలని టిటిడి నిర్ణయించింది.

ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ
ఇక టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 57 ఉద్యోగాల భర్తీకి కూడా టిటిడి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో 57 ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తి కాగా, ఈ ఉద్యోగాల కోసం మొత్తం 37 వేల 121 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
దేవస్థానంలో ముఖ్యమైన ఖాళీల భర్తీ
త్వరలోనే వీరందరికీ రాత పరీక్షలు నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇదే సమయంలో దేవస్థానంలోని ముఖ్యమైన విభాగాలలో ఖాళీలను భర్తీ చేయాలని కూడా టిటిడి భావిస్తోంది. దేవస్థానంలోని ముఖ్యమైన విభాగాలలో ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన, తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని భావిస్తున్న క్రమంలో హైదరాబాదుకు చెందిన అయస్కి అనే సంస్థ టిటిడి కి కొన్ని సూచనలు చేసింది.
నిరుద్యోగుల హర్షం
ఇప్పటికే అధికారుల బృందం కూడా ఈ మేరకు కీలక సిఫార్సులు చేయగా, వాటి ఆధారంగానే టీటీడీ ఈ నిర్ణయాలను తీసుకుంది. ఇక టీటీడీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని వారు టీటీడీకి విజ్ఞప్తి చేస్తున్నారు












Click it and Unblock the Notifications