TTD: శ్రీవారి లడ్డూ పేరుతో అనధికారికంగా, బిగ్ అలర్ట్- టీటీడీ సీరియస్..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావటంతో రద్దీ పెరిగింది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. సాంకేతికత వినియోగం ద్వారా భక్తుల సౌకర్యాలు పెంచేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. బ్రేక్ దర్శనాల మార్పు తరువాత సాధా రణ భక్తులకు ప్రయోజన కరంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక.. ఇదే సమయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వినియోగించుకున్న అంశాన్ని గుర్తించిన టీటీడీ వారి పైన కఠిన చర్యలకు సిద్దమైంది.
కోట్లాది మంది శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం పేరును అనధికారి కంగా వినియోగించుకుంటున్న కొన్ని సంస్థలపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విధంగా చేస్తు న్న పలు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్) హక్కులను ఉల్లం ఘిస్తూ స్వామి లడ్డూ పేరుతో తమ ఉత్పత్పులను విక్రయిస్తున్న, ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు పూనుకుంది. ఇప్పటికే కొన్ని సంస్థలకు గత నెల 31వ తేదీన నోటీసులు జారీ చేసింది. 2009 సెప్టెంబరులోనే చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ర్టీ విభాగం ద్వారా తిరుమల శ్రీవారి లడ్డూ పేటెంట్ రైట్స్‌ను పొందింది. 1999లో జియోగ్రాఫికల్ ఐండికే షన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం ప్రకారం జీఐ హక్కులను సాధించింది. అయితే ఆన్‌లైన్ ద్వారా, నేరుగా కొన్ని స్వీట్స్ విక్రయ సంస్థలు శ్రీవారి లడ్డూ పేరుతో విక్రయాలు చేస్తున్నట్టు టీటీడీ గుర్తించింది.

దీంతో, టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి పైన చర్యలు ప్రారంభించింది. శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ లా విభాగం అధికారు లు ఢిల్లీకి చెందిన సహదేవ లా చాంబర్స్ ద్వారా పుష్ మై కార్ట్, ట్రాన్సాక్ట్ ఫుడ్స్ లిమిటెడ్, ఇండియా స్వీట్ హౌస్ తో సహా మరి కొన్నిసంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై పుష్ మై కార్ట్ వెంటనే స్పందిస్తూ, తమ ఉత్పత్తుల జాబితా నుంచి లడ్డూ ప్రసాదం పేరును తొలగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. మరికొన్ని సంస్థలు కూడా లడ్డూ ప్రసాదం పేరును తొలగించినట్టు తెలిసింది. కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వీట్ కాదని, ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా టీటీడీ స్పష్టం చేసింది. పవిత్రమైన స్వామి లడ్డూప్రసాదాన్ని తప్పుగా వాడితే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications