TTD: వేసవి సెలవుల్లో తిరుమలకు వెళ్తున్నారా - టీటీడీ బిగ్ అప్డేట్..!!

Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. వేసవి ప్రారంభం కావటంతో.. తిరుమలలో రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవి వేళ తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వ స్తారు. ఈ ఏడాది భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసిన వెంటనే శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో, వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం .. సేవల కు సంబంధించిన టికెట్ల పై టీటీడీ కీలక ప్రకటన చేసింది.

మే నెల దర్శన కోటా
ప్రతీ వేసవిలోనూ తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మార్చి, ఏప్రిల్ రెండు నెలల కు సంబంధించిన శ్రీవారి దర్శనం.. సేవలతో పాటుగా వసతి కోటాను టీటీడీ విడుదల చేసింది. అ దే విధంగా మే నెలకు సంబంధించిన కోటాను ఆన్ లైన్ లో ఈ నెల 18వ తేదీ నుంచి అందుబా టులోకి రానుంది. రేపు (18వ తేదీ) నుంచి ఈ ఏడాది మే నెల కు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లతో పాటుగా తోమాల, అష్టాదళ పాద పద్మ ఆరాధన, ఇతర సేవలకు సంబంధించిన కోటా ను టీటీడీ విడుదల చేయనుంది. 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ టోకెన్లు అందుబా టులో ఉండనున్నాయి. ఆసక్తి ఉన్న భక్తులు వెంటనే టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.

TTD to issues Srivari Darshan and Seva Tickets for the month of May from 18

సేవలు- వసతి కోటా
ఫిబ్రవరి 18 నుంచి 20 తేదీ లోపు ఈ సేవా టికెట్లను రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్ లించాల్సి ఉంటుంది. లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి మాత్రమే ఈ టోకెన్లు మంజూరు చేస్తారు. ప్ర ధానంగా శ్రీవారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్ సవం ఉంజాల్‌ సేవా, సహస్రదీపారాధన టోకె న్లను ఫిబ్రవరి 21 తేదీన అందుబాటులోకి రాను న్నాయి. ఇక, ఫిబ్రవరి 22వ తేదీ శ్రీవాణి ట్రస్టు టికెట్ల మే నెలకు సంబంధించిన కోటాను విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం దివ్యాంగులు, వృద్ధులకు సంబంధించిన టోకెన్లను విడుదల చేయను న్నారు.

టీటీడీ సూచన
ఇక, ఫిబ్రవరి 24వ తేదీ ప్రత్యేక దర్శనం రూ. 300 టోకెన్లను జారీ చేసేలా టీటీడీ నిర్ణయం తీసు కుంది. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. అదే రోజు మధ్యా హ్నం 3 గంటలకు వసతి గదుల బుకింగ్ కు సైతం అవకాశం కల్పిస్తున్నారు. మే నెలలో తిరుమ లకు ప్లాన్ చేసుకునే భక్తులు ttddevsthan.ap.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ టోకెన్లను పొందాలని టీటీడీ సూచించింది. ఇదే సమయంలో..తిరుమల శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది. ఇటీవల కొంత మంది భక్తులు తమకు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి క్యూలైన్లలోకి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న విషయాన్ని ప్రస్తావించింది. దీంతో, నిర్ణీత సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టిటిడి కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+