TTD: టీటీడీ నూతన జేఈవోగా వెంకయ్య చౌదరి
టిటిడి ప్రక్షాళనకు నడుం బిగించింది టిడిపి కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిన్సియర్, సీనియర్ అధికారులను టిటిడి బాధ్యతలలో నియమిస్తున్నారు.
టీటీడీ నూతన జేఈవో వెంకయ్య చౌదరి
టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామల రావును నియమించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.టీటీడీ జేఈవోగా మరో సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. ఈయన కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి వస్తున్నారు.

డిప్యుటేషన్ పై వస్తున్న వెంకయ్య చౌదరి
ఆయన 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్ పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఆయన డిప్యుటేషన్ పై ఏపీలో మూడేళ్ల పాటు తన సేవలను అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సాక్షి మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
సమర్ధుడైన అధికారి వెంకయ్య చౌదరి
మంచి సమర్థవంతమైన అధికారిగా పేరున్న వెంకయ్య చౌదరి రాకతో టిటిడిలో చాలా మార్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు. టీటీడీ జేఈఈవోగా నియమితులైన వెంకయ్య చౌదరి ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్), విజయవాడ విభాగంలో కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీగా కూడా పనిచేశారు.
వైసీపీ హయాంలో జరిగిందిదే
ఆయనను టిటిడి జేఈవోగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతికి ఇద్దరు జేఈవోలు ఉండాల్సి ఉండగా, ఇద్దరు జేఈవోలను తిరుపతి కే పరిమితం చేశారు. తిరుమలలో ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగించారు.
తిరుమల ప్రక్షాళనకు చంద్రబాబు చర్యలు
ఇక చంద్రబాబు ప్రభుత్వం పాత పద్ధతిలోనే ఈవోతో పాటు తిరుమలకు జేఈవో ను కొనసాగిస్తారని తాగా నిర్ణయంతో తెలుస్తుంది.ఏది ఏమైనా తిరుమల ప్రక్షాళన పై దృష్టి పెట్టిన చంద్రబాబు ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ సమర్థవంతంగా పనిచేయగల సీనియర్ అధికారులకు బాధ్యతలను అప్పగిస్తున్నారు.












Click it and Unblock the Notifications