ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష వ్యాఖ్యల ఎపిసోడ్ లో ట్విస్ట్ .. ఆమె ఎమ్మెల్యే సీటుకే ఎసరు
Recommended Video
దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పై కుల వివక్ష వ్యాఖ్యలు ఎపిసోడ్ లో ట్విస్ట్ చోటుచేసుకుంది . అది తిరిగి శ్రీదేవి మెడకే చుట్టుకునేలా ఉంది. వినాయక చవితి పండుగ నాడు దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వినాయకుడికి పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని టీడీపీ నాయకులు కుల వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం ఏపీ లో కలకలం రేపింది. కన్నీరు పెట్టుకున్న శ్రీదేవి తనపై చేసిన కులవివక్ష వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసి, సదరు వ్యక్తుల ను కఠినంగా శిక్షించాలని కోరారు.దీనిపైన వెంటనే స్పందించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. అందులో భాగంగా శ్రీదేవి పై దూషణలు చేసిన నలుగురు టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసే పనిలో పడ్డారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు శివయ్య ను అరెస్ట్ చేసిన పోలీసులు, మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

తన భర్త కాపు సామాజిక వర్గం అని , తాను క్రిస్టియన్ అని చెప్పిన ఎమ్మెల్యే శ్రీదేవి
ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎమ్మెల్యే శ్రీదేవి ఆ తర్వాత చెప్పిన ఒక విషయం ఇప్పుడు శ్రీదేవిని చిక్కుల్లో పడేసేలా కనపడుతుంది. తిప్పలు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. ఈ వివాదాస్పద అంశం ఏకంగా ఆవిడ ఎమ్మెల్యే పదవికే ఎసరు తెచ్చేలా కనపడుతుంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమెకే చేటు చేసేలా ఉన్నాయి. ఇక ఇంతకీ శ్రీదేవి ఏమన్నారంటే తన భర్త కాపు కులానికి చెందిన వారిని, ఇక తాను క్రిస్టియన్ అని శ్రీదేవి తెలిపింది. అయితే ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన తాడికొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీ గా ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఇప్పుడు తను క్రిస్టియన్ అని చెప్పడం ప్రతిపక్ష పార్టీలకు ఓ ప్రధాన అస్త్రంగా మారనుంది .

క్రిస్టియన్ అని చెప్పిన శ్రీదేవి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చెయ్యటం చెల్లదని వాదన
ఎవరైనా దళితులు మతం మార్చుకుంటే చట్టప్రకారంగా వారికి సంక్రమించే ఎస్సీ రిజర్వేషన్లను కోల్పోతారు. క్రిస్టియన్ కాబట్టి ఆమె ఎస్సీ గా రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అనర్హురాలు . ఇక ఆమె స్వయంగా తన నోటి ద్వారానే క్రిస్టియన్ అని చెప్పడంతో ఆమె శాసనసభ సభ్యత్వానికి ముప్పు పొంచి ఉందని చెప్పాలి. ఇక ఇప్పటికే దళితులు క్రిస్టియన్ గా మారినా వారిని ఎస్సీగానే చెప్పుకుంటున్నారని, ఎస్సీ గా రిజర్వుడు కేటగిరీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని పొందుతున్నారని బీజేపీ అనుబంధ వీహెచ్ పీ ,ఆరెస్సెస్ చాలా సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు శ్రీదేవి ఎపిసోడ్ లో బిజెపి ఈ కొత్త విషయాన్ని కూడా అందిపుచ్చుకున్నా అశ్చర్యం లేదనే భావన ఉంది ..

శ్రీదేవి శాసనసభ సభ్యత్వానికే ఎసరు పెట్టిన ఆమె తాజా వ్యాఖ్యలు
శ్రీదేవి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి తన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ప్రత్యర్థులు రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఎపిసోడ్ లో ఆమె చేసిన వ్యాఖ్యలే ఆమె ఎమ్మెల్యే పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి పండుగ రోజున వినాయకుడి సాక్షిగా జరిగిన కుల వివక్ష ఎపిసోడ్ లో శ్రీదేవి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మలుపుతిప్పి ఆమె ఎమ్మెల్యే పదవిని ఊడగొట్టేలా ఉన్నాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications