పరిటాల శ్రీరామ్ పెళ్లి ఏర్పాట్లలో విషాదం: ఇద్దరు మృతి
హైదరాబాద్/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లి పనుల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్-జ్ఞానవిల వివాహం అక్టోబర్ 1న జరగనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన డెకరేషన్ సామాగ్రిని డీసీఎం వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ఇద్దకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, పరిటాల శ్రీరామ్ నిశ్చితార్థం ఆగస్టు 10న హైదరాబాద్‌లో జరిగింది. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలోని ఏవీఆర్ కన్ స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె జ్ఞానవితో పరిటాల శ్రీరామ్ పెళ్లి అక్టోబర్ 1న నిశ్చయించారు.












Click it and Unblock the Notifications