ప్రమాదం కూడ స్నేహితులను వీడదీయలేదు
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే చనిపోగా, మరోకరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.రాజశేఖర్, అచ్యుతరామారావు, భావన చిరంజీవిలు ప్రాణస్న
పశ్చిమగోదావరి జిల్లా :ఆ ముగ్గురు ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుండి స్నేహితులుగానే ఉన్నారు. వివిద వృత్తుల్లోకి కొనసాగుతోన్న తమ స్నేహాన్ని మాత్రం కొనసాగించారు. అయితే ప్రమాదంలో కూడ ఒకరిని విడిచి మరోకరు ఉండలేదు. ముగ్గురిలో ఇద్దరు మరణించగా, మరోకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిని కొయ్య రాజశేఖర్, మేడపాటి అచ్యుతరావు, భావన చిరంజీవిలు ప్రాణస్నేహితులు. చిన్నప్పటి నుండి ముగ్గుురు కలిసే తిరుగుతారు.స్థానిక సుబ్బరాజుపేటలో జరగనున్న వివాహ పనుల్లో ఈ ముగ్గురు దగ్గరుండి పనిచేస్తున్నారు.గురువారం తెల్లవారుజామున మోటార్ సైకిల్ పై నిడదవోలు పట్టణం వెళ్ళారు, తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.

గాంధీనగర్ సీతారామరాజు బొమ్మ వద్ద మోటార్ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్థంబాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొయ్య రాజశేఖర్ ,అత్యుతరామారావు అక్కడికక్కడే మరణించాడు. భావన చిరంజీవి మాత్రం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
చనిపోయిన రాజశేఖర్ కు ఇద్దరు సోదరులు, సోదరి ఉంది. అచ్యుతరామారావు వారి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. వీరి మరణంతో కటుుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ప్రాణస్నేహితుల్లో ఇద్దరు మరణించగా, మరోకరు ప్రాణపాయంలో ఉన్నాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications