జగన్ ను టార్గెట్ చేసిన ఉండవల్లి..! ఎందుకిలా .. అర్ధం కావట్లేదు..!
రేపు జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ తో ఇండియా కూటమి అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అమీతుమీ తేల్చుకోబోతున్నారు. ఉపరాష్ట్రపతి ధన్ కడ్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన స్ధానానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల వైఖరిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు కీలక సూచన చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలంతా ఇండియా కూటమి అభ్యర్ధి , తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికే ఓటు వేయాలని ఉండవల్లి సూచించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డిని ఎంచుకోవాలని కోరారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహారశైలిపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. తనను ఓడించిన ఎన్డీయే నిలబెట్టిన అభ్యర్ధికి ఆయన ఎందుకు మద్దతిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. తనను జైలుకు పంపిన కాంగ్రెస్ అంటే కోపం ఉండొచ్చని, కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అయితే మాత్రం రాజ్యాంగాన్ని నిలబెడతారని ఉండవల్లి తెలిపారు. జగన్ ఇండియా కూటమి అభ్యర్ధి అయిన తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికే మద్దతివ్వాలన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు ఓటేస్తే ఆరెస్సెస్ కు ఓటేసినట్లేనని ఉండవల్లి అరుణ్ తెలిపారు. అసలు ధన్ కడ్ తో ఆకస్మికంగా ఎందుకు రాజీనామా చేయించారో కేంద్రంలో బీజేపీ పెద్దలు చెప్పాలన్నారు. బీజేపీ విధానాల్ని వ్యతిరేకిస్తూ ఎన్డీయే అభ్యర్ధికి ఓటేస్తే ద్రోహులుగా మిగిలిపోతారంటూ జగన్ తో పాటు బీజేపీ అభ్యర్ధికి మద్దతిస్తున్న పార్టీల్ని ఉండవల్లి హెచ్చరించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications