టీడీపీ క్యాంపులో మంటపుట్టించిన గడ్కరీ-చంద్రబాబుకు హ్యాండ్ ? ఇక ఆయనా దూరమైతే..

ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో అంతగా సంబంధాలు ఉండేవి కావు. దీనికి భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం కేంద్రంలో బీజేపీ పెద్దలతో పాటు చాలా మంది కేంద్రమంత్రులతో పరిచయాలు ఉండేవి. గతంలో రెండుసార్లు బీజేపీతో కలిసి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో కొనసాగడం, ఆ తర్వాత కూడా సంబంధాలు కొనసాగించడమే ఇందుకు కారణం. కానీ 2018లో ఎన్డీయేను వీడిన తర్వాత మారిన పరిస్ధితుల్లో చాలామంది దూరమైనా గడ్కరీ వంటి వారు మాత్రం ఇంకా సన్నిహితంగానే ఉన్నారని చెబుతారు. అలాంటి గడ్కరీ కూడా ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 గడ్కరీతో చంద్రబాబు బంధం

గడ్కరీతో చంద్రబాబు బంధం

బీజేపీతో దిగ్గజ నేతగా, బలమైన ఆరెస్సెస్ సంబంధాలు కలిగిన నాయకుడిగా, ప్రధాని మోడీ తర్వాత బీజేపీలో ప్రధాని పదవికి పోటీ పడగల సత్తా ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు నితిన్ గడ్కరీ. గతంలో, ఇప్పటికీ ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రతిసారీ గడ్కరీకి కేబినెట్ లో చోటు దక్కాల్సిందే. అదే సమయంలో ఏపీలో గతంలో రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీతో ఆయన బంధం కూడా అదే స్దాయిలో ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా చంద్రబాబుతో గడ్కరీకి ఉన్న సంబంధాలు విడదీయరానివనే పేరు ఉండేది.

మోడీని కాదని గడ్కరీని ప్రధాని చేసేందుకు

మోడీని కాదని గడ్కరీని ప్రధాని చేసేందుకు

2018లో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో విభేధించి టీడీపీ మంత్రుల్ని రాజీనామా చేయించి, అనంతరం ఎన్డీయే నుంచి కూడా వైదొలిగిన చంద్రబాబు.. గడ్కరీతో మాత్రం పాత సంబంధాల్ని కొనసాగించారనే ప్రచారం ఉంది. అదే ఊపులో మోడీని ఎట్టి పరిస్ధితుల్లో 2019లో ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు గడ్కరీని ప్రత్యామ్నాయ అభ్యర్ధిగా మిగతా రాజకీయ పక్షాల్ని ఒప్పించేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించారని చెబుతారు. అనంతరం మోడీ, అమిత్ షాపై ధర్మపోరాటం చేసి విఫలమైన చంద్రబాబు.. ఆ తర్వాత వారికి దగ్గరయ్యేందుకు నాగపూర్ వెళ్లి మరీ గడ్కరీ సాయం కోరినట్లు ప్రచారం ఉంది. కానీ ఈ ఎత్తులేవీ ఫలించలేదు.

 ఇప్పటికీ గడ్కరీతో సంబంధాలు

ఇప్పటికీ గడ్కరీతో సంబంధాలు

ఎన్డీయేకు దూరంగా ఉన్నా, మోడీ-షాలతో పాత సంబంధాలు పునరుద్ధరించుకిునే అవకాశం లేకపోయినా ఇప్పటికీ చంద్రబాబు గడ్కరీకి దగ్గరగానే ఉన్నారని చెబుతారు. గడ్కరీతో చంద్రబాబుకు ఉన్న సంబంధాల నేపథ్యంలో మరోసారి మోడీ కాకుంటే బీజేపీలో ప్రధాని ఎవరనే ప్రశ్న తలెత్తితే మాత్రం గడ్కరీకి మద్దతిచ్చేందుకు చంద్రబాబు ఎప్పటికీ సిద్ధంగానే ఉంటారు. అలాంటి బంధం వారిది. దీంతో మిగతా బీజేపీ నేతలంతా చంద్రబాబును ఆడుకుంటున్నా.. గడ్కరీ మాత్రం పల్లెత్తుమాట అనేందుకు ఇష్టపడరనే ప్రచారం ఉంది.

చంద్రబాబుకు హ్యాండ్ ?

చంద్రబాబుకు హ్యాండ్ ?


తాజాగా విజయవాడ పర్యటనలో బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ ఎన్నడూ లేని విధంగా తొలిసారి సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. డైనమిక్ సీఎం అంటూ ఆకాశానికెత్తేశారు. జగన్ అడిగిన విజయవాడ తూర్పు బైపాస్ ను అక్కడిక్కడే ఆమోదించేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 20 ఫ్లైఓవర్లు అడిగితే 30 తీసుకోమన్నారు. ఇదంతా చూస్తున్న టీడీపీ క్యాంపుకు మంటపుట్టుకొస్తోంది. అంతే కాదు చంద్రబాబుకు, టీడీపీకి గడ్కరీ హ్యాండిచ్చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అది జరిగితే ఇక ఎన్డీయేలో చేరేందుకు చంద్రబాబుకు ఉన్న చివరి దారి కూడా మూసుకుపోయినట్లేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+