ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!!
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ, తెలంగాణలో మరో రెండు కొత్త ఏయిర్ పోర్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో భోగాపురం విమానాశ్రయం ఆపరేషన్స్ త్వరలో ప్రారంభించేందుకు సిద్దమైంది. మూమునూరు విమానాశ్రయం శంకుస్థాపనకు ముహూర్తం సిద్దం చేసారు. ఉడాన్ 2.0లో భాగంగా రెండు రాష్ట్రాల్లో నిర్మించనున్న కొత్త విమానాశ్రయాలపై రెండు ప్రభుత్వాల తో చర్చల తరువాత ఎక్కడ నిర్మించాలనేది నిర్ణయించారు.
ఏపీ, తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఉడాన్ 2.0లో భాగంగా రెండు రాష్ట్రాల్లో నిర్మించనున్న కొత్త విమానాశ్రయాలపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఏపీలో మరో కొత్త ఎయిర్ పోర్టు పైన స్పష్టత ఇచ్చారు. కొత్త విమానాశ్రయం పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నట్లు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కూడా విమానాశ్రయం నిర్మిస్తామన్నారు. దీని వల్ల ఆ రెండు ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ లభిస్తుందని, లాజిస్ట్రిక్స్ రంగం అభివృద్ది చేయడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌స్ట్రిప్ రక్షణశాఖ ఆధీనంలో ఉందని, దాని పక్కన అదనపు భూమిని సేకరించి ప్రయాణికుల కోసం కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని తెలిపారు.

కొత్త విమానాశ్రయాలు నిర్మాణం వేగవంతం
అటు బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద ట్రాఫిక్ టన్నెల్ నిర్మాణానికి అనుమతి వచ్చిందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం దానికి అయ్యే ఖర్చు భరిస్తే తాము పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేసారు. ఉడాన్ 2.0 పథకం కింద మొత్తం రూ.28 వేల కోట్ల నిధులు కేటాయించగా.. అందులో రూ.12 వేల కోట్ల నిధులు కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం కేటాయించామని చెప్పారు. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ ఫైల్ వివిధ శాఖల దగ్గర ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌లో శంకుస్థాపన చేసేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. కొత్తగూడెం, బసంత్ నగర్ ఎయిర్‌పోర్టులకు సంబంధించి భూ కేటాయింపులు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక భోగాపురం, గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణ పనులు తుది దశకు వచ్చాయని, వచ్చే ఏడాది జూన్ కల్లా పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications