ఉద్యోగాల పేరుతో మోసం, వేధింపులు-కేంద్రమంత్రి అనుచరుడి నిర్వాకం-వైసీపీ ట్వీట్..!

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అనుచరుడు ఒకరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల పేరుతో అభ్యర్ధుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడంతో పాటు అడిగితే వేధింపులకు దిగుతున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై విపక్ష వైసీపీ ఇవాళ ఎక్స్ లో పెట్టిన పోస్టు సంచలనం రేపుతోంది. కేంద్రమంత్రి పేరు చెప్పుకుని సదరు వ్యక్తి పాల్పడుతున్న మోసం, వేధింపులపై చర్చ జరుగుతోంది.

శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు అంటూ వైసీపీ ఇవాళ ఓ ట్వీట్ చేసింది. ఇందులో బసవ రమణ అనే వ్యక్తి ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడినట్లు ఆరోపించింది. శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసి.. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిల్ని వేధిస్తున్నట్లు తెలిపింది.

union minister rammohan naidu s close aide cheating harassment to women by the name of jobs

బసవ రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి.. చిత్రహంసలు
కూడా పెట్టారని తెలిపింది. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి బసవ రమణ దందాలు చేస్తున్నాడని, షాపింగ్ మాల్స్‌, బార్స్‌కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. ఎన్నో ఏళ్ళ నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

ఈ బసవ రమణ అనే వ్యక్తి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్‌‌కి సన్నిహితుడు కూడా అని వైసీపీ ట్వీట్ లో తెలిపింది. పాలన చేతకాకపోతే ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా అని సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసి అడిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+