రాజకీయాల్లోకి రంగా కుమార్తె ? విశాఖలో భారీ సభ..! అక్కడే..!
ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు దివంగత కాపు నేత వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సడన్ గా ఏపీ పొలిటికల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వడం, పైకి రాజకీయాలకు దూరం, సేవా కార్యక్రమాలే తన లక్ష్యం అని చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం చురుగ్గా పావులు కుదుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడ వదిలి విశాఖలో ఓ భారీ సభకు ఆమె ప్లాన్ చేశారు. ఈ మేరకు ఇవాళ బహిరంగంగానే ప్రకటన చేశారు.
వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖ లో రంగనాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆశా కిరణ్ ప్రకటించారు. రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగనాడు పోస్టర్ ని ఆవిష్కరించిన ఆమె..రాధా రంగ మిత్ర మండలి సభ్యుల్ని చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా ఉందన్నారు. కుల,మత, రాజకీయాకు అతీతంగా విశాఖలో సభ పెడుతున్నట్లు తెలిపారు. ఇది రంగా అభిమానులు కోసం నిర్వహించే సభ అన్నారు. అన్ని పార్టీ ల్లో ఉన్న అభిమానులు దీనికి రావాలన్నారు.

చేయి చేయి కలుపు.. చేజారదు గెలుపు అని నాన్న రంగా చెప్పేవారని, ఇప్పుడు అదే స్లోగన్ తో రాధారంగ మిత్ర మండలి ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని ఆశా కిరణ్ తెలిపారు. తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని, రాధారంగ మిత్ర మండలి తరపున పనిచేయడానికే వచ్చానని మరోసా వెల్లడించారు. ఏ పార్టీ తో ఇప్పుడు తనకు సంబంధం లేదన్నారు. చారిటబుల్ కింద రాధారంగ మిత్ర మండలి పని చేస్తుందన్నారు. తన రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తర్వాత చెబుతానన్నారు. ప్రస్తుతం ప్రజలకు తన వంతుగా సేవ చేస్తానని, రాధా రంగ మిత్ర మండలి కార్యక్రమాలు విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.

తాను ఈ సభలో ఎటువంటి రాజకీయ ప్రకటన చేయడం లేదని, ఏ పార్టీ లో చేరడంలేదని ఆశా కిరణ్ స్పష్టం చేశారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే వారంతా ఆయన వారసులే అన్నారు. అన్న వంగవీటి రాధాకృష్ణ తో ఎటువంటి విభేదాలు లేవని కూడా తెలిపారు. అనవసరంగా గాసిప్స్ ప్రచారం చేయవద్దని కోరారు. రేవిశాఖలో జరిగే సభకు వంగవీటి రాధాకృష్ణను ఆహ్వానించారన్నారు. మూడేళ్లు తన పని తీరు, సేవా కార్యక్రమాలు అందరూ చూస్తారన్నారు. రాధారంగ మిత్ర మండలి పెద్దల ఆదేశాలు , సూచనల ప్రకారం తన రాజకీయ నిర్ణయం అప్పుడు ఉంటుందన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications