Vangaveeti Radha Marriage: పెళ్లిపీటలెక్కనున్న రాధా - వధువు ఎవరంటే..!!
వంగవీటి రాధా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటి వరకు పలు సందర్భాల్లో వివాహం గురించి వంగవీటి రాధను ప్రశ్నించారు. ఆయన నుంచి చిరునవ్వే సమాధానంగా ఉండేది. ఇప్పుడు ఎన్నికల కు సిద్దం అవుతున్న వేళ...రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న రాధా, ఇప్పుడు ఆకస్మికంగా వివాహ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఇప్పుడు రాధా వివాహం చేసుకునే వధువు ఎవరనే ఆసక్తి మొదలైంది. రాజ కీయ కుటుంబానికి చెందిన యువతినే రాధా వివాహం చేసుకోబోతున్నారు.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న వంగవీటి రాధాకృష్ణ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 19న నిశ్చితార్ధంకు ముహూర్తంగా నిర్ణయించారు. నర్సాపురంకు చెందిన యువతితో జరగబోతుందని సమాచారం. ఈ నెల 19న సర్సాపురంలో ఎంగేజ్‌మెంట్ వేడుక నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 6న వివాహానికి ముహూర్తంగా నిర్ణయంచారు. రాధా వివాహం విజయవాడ, లేదా బెంగళూరులో నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు అతిముఖ్యమైన సన్నిహితులకు మాత్రమే రాధా తన వివాహం గురించి షేర్ చేసుకున్నారు.

నరసాపురం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కుమార్తెతో రాధా వివాహం జరగనుందని అనుచరులు చెబుతున్నారు. రాజకీయంగానూ కీలక నిర్ణయం దిశగా రాధా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని రాధా భావిస్తున్నారు. అక్కడ టీడీపీ నుంచి బోండా ఉమ సీటు ఆశిస్తున్నారు. జనసేనలో చేరినా సెంట్రల్ సీటు దక్కుతుందా అనేది అనమానంగానే కనిపిస్తోంది. దీంతో, రాధా టీడీపీలో కొనసాగుతారా లేక ప్రచారం సాగుతున్నట్లుగా జనసేనలో చేరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ఇక, రాధా వివాహం అభిమానులను అందరినీ ఆహ్వానించి గ్రాండ్‌గా చేస్తారా, లేదా కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. తన వివాహం గురించి వంగవీటి రాధా అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు వంగవీటి అభిమానుల్లో సంతోషం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications