కంత్రి, ఓ మంత్రి మధ్యలో ఇంతి పోస్టు... సీఎం జగన్ స్పందించాలన్న వర్ల రామయ్య

కంత్రీ , ఓ మంత్రి, మధ్యలో ఇంతి పోస్టులో వాస్తవాలపై నిగ్గు తేల్చాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విశాఖ రాసలీలలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.ఇక ఈ వ్యవహారంపై విశాఖలో ఎవరిని అడిగిన వివరాలు చెబుతారని, ఇప్పటికే ఇంటిలిజెన్స్,స్పెషల్ బ్రాంచ్ నుండి ముఖ్యమంత్రికి నివేదికలు వచ్చి ఉంటాయని వర్ల రామయ్య అన్నారు.

కంత్రి ఓ మంత్రి మధ్యలో ఇంతి పోస్ట్ లో పేర్కొన్న అంశాలు అవాస్తవం అయితే ఫార్వర్డ్ చేసిన నందకిషోర్ ను విడిచిపెట్టాలి. లేదా అది నిజమైతే కంత్రి ఓ మంత్రి మధ్యలో ఇంతి పోస్ట్ నిజమైతే దర్యాప్తు చెయ్యాలని,పోస్ట్ ను సృష్టించిన క్రియేటర్ ను అరెస్ట్ చేయాలి అని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఆసుపత్రిలో మహిళ చేరడం, ఆత్మహత్యకు పాల్పడడం విలేకరి వద్ద ఫోటోలు ఉండటం వాస్తవం కాదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు.శాంతిభద్రతల శాఖను నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Varla ramaiah demanded CM Jagan to respond on the social media posts

సోషల్ మీడియాలో పోస్ట్ మొదట పెట్టిన వారిని వదిలి పెట్టి, సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేసిన నలంద కిషోర్, నందిగామ కృష్ణలను అరెస్ట్ చేయడం దారుణమని,ఇక వారిని విడుదల చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం టీడీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు . వైసీపీ సానుభూతిపరులపై ఎన్నో ఫిర్యాదులు చేసినా ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని వర్ల రామయ్య విమర్శించారు. ఇప్పటికైనా నలంద కిషోర్ నందిగామ కృష్ణ ను విడిచిపెట్టాలని కోరుతున్నామని వర్ల రామయ్య పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+