జగన్‌ను విమర్శించేందుకే వాడుకున్నారా?: వర్ల రామయ్య మనోవేదన!
ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన గత వారం నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అమరావతి: ఇప్పటికే మంత్రి కేఈ కృష్ణమూర్తి తన సోదరుడు కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నేత కూడా ముందుకు వచ్చారు.
తాజాగా, ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన గత వారం నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు తనను వాడుకుని వదిలేశారని ఆయన తన సహచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications