మీరు హోం మంత్రిగా ఫెయిల్ అయ్యారు .. సుచరితకు వర్ల రామయ్య బహిరంగలేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి సుచరితపై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో సుచరిత పూర్తిగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. హోం మంత్రి సుచరితకు బహిరంగ లేఖ రాసిన వర్ల రామయ్య పేరుకు మాత్రమే మీరు హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ, రాష్ట్రంలో పరిస్థితులను, శాంతి భద్రతల పరిరక్షణ చూడడం లేదంటూ విరుచుకుపడ్డారు.

వర్ల రామయ్య రాసిన లేఖలో హోం శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలో మీరు పూర్తిగా విఫలమయ్యారు. మీ బాధ్యతలు మీ పార్టీలో ఒక పెద్ద మనిషికి దాఖలు చేశారని అంతటా వినిపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన ఏ ఘటన జరిగిన మీరు స్పందించడం లేదు అనే మాటే వినిపిస్తోంది అంటూ పార్టీలోని ఓ పెద్దమనిషి ఏది చెప్తే అది హోం శాఖ మంత్రి సుచరిత చేస్తున్నారని, పేరుకు మాత్రమే ఆమె హోం మంత్రిగా ఉన్నారు అంటూ లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.

varla ramaiah open letter .. Sucharitha had completely failed as home minister

రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు జరిగినా కూడా హోంమంత్రి సుచరిత చూస్తూ మౌనం వహించటం విడ్డూరంగా ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దళిత ఓటు బ్యాంకును దండుకుని అధికారంలోకి వచ్చిందని,అలాంటి దళిత వర్గాలను పూర్తిగా విస్మరించడం అన్యాయమని వర్ల రామయ్య తెలిపారు. రాష్ట్రపతి దాకా వెళ్ళిన శిరోముండనం కేసును మీరు ఇప్పటివరకు సమీక్షించిన దాఖలాలు లేవని సుచరిత నుద్దేశించి పేర్కొన్నారు.

శిరోముండనం కేసులో మీ దర్యాప్తు ఈ విధంగానే ఉంటే, భవిష్యత్తులో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి కూడా ముద్దాయిగా బోన్ లో నిలబడే ప్రమాదం ఉంది అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. బాధితుడు స్టేట్మెంటు కూడా దర్యాప్తు అధికారి సంపూర్ణంగా నమోదు చేయలేదని వర్ల రామయ్య ఆరోపించారు. శిరోముండనం కేసులో బాధితుడికి న్యాయం చేయాలని, అంతంతమాత్రంగా ఉన్న మీ ప్రభుత్వ పరువు నిలబెట్టుకోవాలని వర్ల రామయ్య హోంమంత్రి సుచరిత కు హితవు పలికారు.

Fact Check

వాదన

వాస్తవం

రేటింగ్

Half True
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+