వరుణ్ తేజ్ పెళ్లికి ఆమె దూరం : మెగాస్టార్ ప్రత్యేక ఏర్పాట్లు..!!

మెగా హీరో వరుణ్ తేజ్​- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 1న ఈ జంట ఒక్కటి కానుంది. ఇప్పటికే మెగా -అల్లు కుటుంబ సభ్యుల్లో కొందరు ఇటలీ చేరుకున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం రేపు (సోమవారం) ఇటలీ బయల్దేరుతోంది. పెళ్లి తర్వాత ఇటలీ నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్‌లో నవంబర్‌ 5న రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే, ఈ వివాహానికి చిరంజీవి తల్లి అంజనా దేవి హాజరు కావటం లేదని సమాచారం.

మెగా ఇంట మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడకలను అదరగొట్టిన మెగా హీరోలు..పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అందరికంటే ముందుగా రామ్‌ చరణ్‌-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్​- లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో వెళ్లాడు. ఇలా రామ్‌ చరణ్‌, బన్నీ ఇద్దరూ వరుణ్‌ పెళ్లి ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు (సోమవారం) మెగా-అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ ఇటలీ వెళ్లనున్నట్లు సమాచారం.

Varun Tej and Lavanya Tripathi will get married on November 1, Mega Family fly to Italy tomorrow

ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్‌ 1న పెళ్లి తర్వాత ఇటలీ నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్‌లో నవంబర్‌ 5న రిసెప్షన్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరూ ఆ సమయంలో హాజరు కానున్నారు. వరుణ్‌ వెడ్డింగ్‌ కార్డుకు సంబంధించిన వీడియోతో పాటు కొత్త జంటకు సంబంధిన వీడియోలు,ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. #Varunlav అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. మెగా ఫ్యాన్స్ ఈ వివాహ వేడుకకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తున్నారు.

Varun Tej and Lavanya Tripathi will get married on November 1, Mega Family fly to Italy tomorrow

అయితే, మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి మనవడి పెళ్లికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య రిత్యా జర్నీ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించడంతో ఆమె హైదరాబాద్ లోనే ఉంటారని సమాచారం. దీంతో వరుణ్‌- లావణ్యల పెళ్లిని ఇంటి నుంచే వీడియోలో చూసే విధంగా చిరంజీవి ప్లాన్‌ చేశారని సమాచారం. ఇక, ఇటలీలో పెళ్లి వేడుకలు పూర్తయిన తరువాత హైదరాబాద్ కేంద్రంగా జరిగే రిసెప్షన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+