పవన్ ప్రమాణస్వీకారానికి రాని లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్; కారణం తెలిసి ఆందోళనలో మెగాఫ్యాన్స్

పిఠాపురం నియోజకవర్గంలో తన బాబాయి గెలవాలని, ప్రచారం కూడా చేసిన వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీ చిరంజీవి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అటువంటి వారు ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు అన్నది అభిమానులకు ఆందోళన కలిగించింది.

పవన్ ప్రమాణ స్వీకారానికి రాలేకపోయిన వరుణ్ లావణ్య దంపతులు
వారిద్దరూ ప్రమాణ స్వీకారానికి రాలేనంత బలమైన కారణం ఏమిటి అన్నది మెగా అభిమానులకు తెలుసుకోవాలన్న ఉత్కంఠకు కారణమైంది. దాదాపు ఐదేళ్లపాటు సీక్రెట్ గా లవ్ చేసుకున్న ఈ జంట ఆ తరువాత పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. మెగా కోడలుగా అడుగుపెట్టిన తర్వాత లావణ్య త్రిపాఠి కూడా మెగా ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది. ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది.

Varun Tej Lavanya Tripathi did not attended Pawan swearing-in Mega Fans worried knowing the reason

పవన్ ప్రమాణ స్వీకారానికి ఎందుకు రాలేదు
సినిమాలు చెయ్యకున్నా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ మాత్రం లావణ్య త్రిపాఠి చేసింది. ఇటీవల చిరంజీవి ఇంట్లో జరిగిన పవన్ కళ్యాణ్ విజయోత్సవ వేడుకలలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పవన్ కళ్యాణ్ కు వెల్కమ్ చెప్పి సందడి చేశారు. ఇంత చేసిన వారు పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి రాకపోవడం ఏమిటి? అసలు వారి రాకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటి అన్నది పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

లావణ్య కాలికి గాయం
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంట వస్తారని ఎదురు చూసిన ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కనిపించి ఈ జంట మాత్రం కనిపించకపోవడంతో నిరాశ చెందారు. అయితే అసలు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ రాలేకపోయిన కారణం ఏమిటి అంటే ఇటీవల లావణ్య త్రిపాఠీకి ప్రమాదం జరిగింది. ఆమె కాలికి గాయమైంది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఒక ఫోటో కూడా షేర్ చేసింది.

నడవలేని స్థితిలో లావణ్య త్రిపాఠి .. అసలేమయింది
ఆ ఫోటో ఆధారంగా లావణ్య త్రిపాఠీకి గాయం పెద్దగానే అయినట్టుగా కనిపిస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన లావణ్య త్రిపాఠికి ఇంతలోనే ఏమైంది.. ఆ దెబ్బ ఎలా తగిలింది? అన్నది ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు. కాళ్లకు కట్టు కట్టించుకుని లేవలేని స్థితిలో ఉన్నారంటే దెబ్బ బాగానే తగిలింది. ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా లేదా ఇంట్లోనే పడ్డారా ఇలా ఎవరికి తోచినట్టు వారు చర్చిస్తున్నారు.

వరుణ్ లావణ్య పవన్ ప్రమాణానికి రాని కారణమిదే
ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేకపోవడం వెనుక కారణం ఇదేనా అని కూడా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా బాబాయ్ పట్ల బోలెడు ప్రేమను వ్యక్తం చేసే వరుణ్ తేజ్ బలమైన కారణం ఉంటే తప్ప పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకుండా ఉండడు. అయితే ఈ బలమైన కారణం లావణ్య త్రిపాఠీకి దెబ్బ తగలడమేనని ఫాన్స్ అర్థం చేసుకున్నారు. ఇక లావణ్య త్రిపాఠి త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+