• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డాక్టర్లకు బిపి పెంచుతున్న..."వీరమాచినేని డైట్ ప్లాన్":పేషెంట్ల ప్రశ్నలతో సతమతం

By Suvarnaraju
|

పేషెంట్లకు మేలు సంగతేమో కానీ తెలుగు డాక్టర్లకు బిపి పెంచుతోంది "వీరమాచినేని డైట్ ప్లాన్"...కారణం ఇటీవలి కాలంలో తమ దగ్గరకు వస్తున్న సగం మందికి పైగా ఈ డైట్ గురించే ఆరాలు తీస్తుండటమే...అసలు కొందరైతే రోగం గురించి కాకుండా ఈ కీటో డైట్ గురించి తమ సందేహాలు తీర్చుకునేందుకే ఫీజులు కట్టి ఒపీలు రాయించుకొని మరీ డాక్టర్ల దగ్గరకు వస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఏపిలో తెలుగు పేషెంట్ల నోటి నుంచి వచ్చే ఒక ప్రశ్న అల్లోపతి డాక్టర్లకు అస్సలు నచ్చడం లేదు...ఆ కొచ్చెన్ ఏంటంటే..."సార్‌..! వీరమాచినేని డైట్ ప్లాన్ వాడమంటారా?"...పేషెంట్ చాలా అమాయకంగా అడిగే ఈ ప్రశ్న డాక్టర్లకు ఎక్కడెక్కడో కాలేలా చేస్తోంది. అందుకే తమ కోపాన్ని ఇప్పటికే పలువురు డాక్టర్లు బహిరంగ వేదికల మీద వెలిబుచ్చారు కూడా...కానీ అదంతా పేషెంట్లు పట్టించుకోవడం లేదు...తమ ఆదుర్థా తమది. ఇప్పుడదే అల్లోపతి వైద్యులకు పెద్ద సమస్యగా మారింది.

ఎపి ఆస్పత్రుల్లో...ఇటీవల...సాధారణ దృశ్యం

ఎపి ఆస్పత్రుల్లో...ఇటీవల...సాధారణ దృశ్యం

తలుపు తీసుకొని పేషెంట్ వస్తాడు...తన రోగం గురించి చెబుతాడు...డాక్టర్ అందుకు కారణాలు,నివారణ, మందులు అన్నీ చెబుతాడు...అయిపోయింది...కానీ పేషెంట్ వెళ్లడు...ఇంకా డాక్టర్ మొహం వైపు చూస్తుంటాడు...డాక్టర్ కు డౌటొస్తుంది...ఏంటని అడుగుతాడు...అప్పుడు పేషెంట్ సందేహిస్తూనే ఒక ప్రశ్న సంధిస్తాడు...అంతే ఆ ప్రశ్నతో మొదట్లో డాక్టర్ కు చిరాకేసేది...ఆ తరువాత కోపమొచ్చేది...ఇప్పుడైతే బిపి పెరిగిపోతోంది. అయినా ఎదురువుంది పేషెంట్ కాబట్టి కంట్రోల్...కంట్రోల్ అని తమాయించుకొని తాను చెప్పాల్సింది చెబుతాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎపిలో డాక్టర్ రూములో కాస్త అటూ ఇటుగా ఇదే సర్వసాధారణంగా కనపడే దృశ్యం.

ఎంతపనిచేశాడు...ఈ వీరమాచినేని

ఎంతపనిచేశాడు...ఈ వీరమాచినేని

డాక్టర్లను ఈ మధ్య కాలంలో పేషెంట్లు తప్పనిసరిగా అడుగుతున్న ప్రశ్న "సార్‌..! ఆ వీరమాచినేని రామకృష్ణ చెబుతున్న కీటోజెనిక్‌ డైట్‌ వాడమంటారా?"... లేదా వాడొచ్చంటారా?...లేక వాడితే ఏమవుతుంది?...ఇలా మొత్తానికి ఆ డైట్ గురించి తన సందేహాలైతే తీర్చుకోని గానీ వెళ్లడం లేదు...వాస్తవానికి ఎక్కువమంది డాక్టర్లు ఈ వీరమాచినేని డైట్ ప్లాన్ కు వ్యతిరేకులే. కారణం అది వైద్య ప్రమాణాలకు అనుగుణంగా సైంటిఫిక్ గా ప్రామాణికమైనది కాకపోవడం...ఆ డైట్ వాడితే అన్ని సమస్యలు పోతాయి...ఇక డాక్టర్లకు డబ్బు తగలేయక్కర్లేదు అన్నట్లుగా ప్రచారం జరుగుతుండటం...ప్రధానంగా ఈ కారణాల చేత వైద్యులు ఈ డైట్ ప్లాన్ అంటేనే వ్యతిరేకిస్తున్న పరిస్థితి.

అయితే పేషెంట్ల...మనసెరిగి...తప్పనిస్థితి

అయితే పేషెంట్ల...మనసెరిగి...తప్పనిస్థితి

మొదట్లో ఈ ప్రశ్న అడిగిన వారికి ఘాటుగా జవాబిచ్చిన డాక్టర్లు ఇటీవలికాలంలో ఈ డైట్ వాడేవారి సంఖ్య...ఈ ప్రశ్నఅడిగేవారి సంఖ్య బాగా పెరిగిపోడంతో పేషెంట్ డిసైడైతే తాము చేయగలిగిందేముంది అన్నట్లుగా...మళ్లీ వాళ్లని నొప్పించి తమ ప్రాక్టీస్ దెబ్బతీసుకోవడం ఎందుకునే అనే ఆలోచనతో పేషెంట్ల మానసిక స్థితిని బట్టో, వారి ఆలోచనా స్థాయిని బట్టో సలహా ఇచ్చి పంపేస్తున్నారు. అయితే అందనూ వ్యతిరేకంగా కాకుండా కొందరు సానుకూలంగానూ చెబుతున్న వైద్యులు కూడా ఉన్నారట. కీటో డైట్‌ పట్ల సందేహాలతో డాక్టర్లను సంప్రదిస్తున్న రోగుల్లో ఎక్కువ మంది షుగర్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు చెందినవారు ఉంటున్నారు. ఊబకాయుల్లో తొంభై శాతం మందికి గుండె, న్యూరాలజీ సమస్యలు ఉంటాయి. వీరమాచినేని చెబుతున్న కీటోడైట్‌ మంచిదేనని కొందరు కార్డియాలజిస్ట్‌లు సజెస్ట్ చేస్తున్నారట. అంటే శరీరం బరువు అదుపులోకి వస్తే అనేక సమస్యలు దూరం అవుతాయనే కోణంలో వారు ఆ విధంగా చెబుతున్నట్లు తెలుస్తోంది.

కీటో డైట్ ప్లాన్...అంటే ఇదే

కీటో డైట్ ప్లాన్...అంటే ఇదే

సాధారణంగా మానవ శరీరం కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం నుంచి ఉత్పత్తి అయ్యే గ్లూకోజ్ ద్వారా శక్తిని పొందుతుంది. అదే గ్లూకోజ్ లేని సందర్భంలో కీటోసిస్ జరుగుతుంది. అంటే కీటోసిస్‌ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే శరీరం శక్తి కోసం గ్లూకోజ్ బదులుగా కొవ్వు పదార్థాలను కరిగించుకుంటుంది. మనం కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే, కాలేయం కొవ్వును కరిగించి, దాని నుంచి శక్తిని పొందుతుంది. ఆ శక్తి "కీటోన్" అనే కణాల రూపంలో ఉంటుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు అందేలా చేయడం ద్వారా శరీరాన్ని ఈ "కీటోసిస్" అనే స్థితికి పంపడమే ఈ కీటో డైట్‌ ఉద్దేశ్యం. దీనికి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహార పదార్దాలను తీసుకోవడమే మూల సూత్రం. కీటోడైట్...దీన్ని ఆధారం చేసుకొని వీరమాచినేని తనదైన శైలిలో ఒక డైట్ ప్లాన్ రూపొందించారని కొందరు వైద్యులు విశ్లేషిస్తున్నారు. విమర్శలొస్తున్నాయి.

అయితే డాక్టర్లు...చెప్పేదేమంటే?

అయితే డాక్టర్లు...చెప్పేదేమంటే?

ఈ కీటో డైట్ అనేది అందరికీ సూట్ కాదని, కొంతమందిలో తీవ్రమైన దుష్ప్రలితాలు తప్పవనేది వైద్యుల హెచ్చరిక. పైగా ఈ కీటో డైట్ అందరిలోనూ ఒకే రకమైన ఫలితాలు ఇవ్వవని, శరీర తీరును బట్టి దాని ఫలితాలు వేరువేరుగా ఉంటాయని చెబుతున్నారు. అది షుగర్ పేషెంట్లలో కిడ్నీలు పాడయ్యేందుకు, షుగర్‌ లెవల్స్‌ పెరిగేందుకు కారణం అవుతుందని అంటున్నారు. అంతేకాదు ఇన్సులిన్ సెన్సిటివిటీని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. క్రానిక్ షుగర్ పేపెంట్లలో ఈ డైట్ వాడకం ప్రాణాలతో చెలగాటమంటున్నారు. పైగా ఈ కీటోజెనిక్ డైట్ దీర్ఘకాలంలో వాడటానికి అదీ నిపుణుల పర్యవేక్షణలో అవలంబిస్తేనే సత్పలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందంటున్నారు. వీటితో పాటు వీరమాచినేని రూపొందించిన డైట్ ఆయన సొంత ఫార్మాలా లాగా ఉందని, అది వైద్య శాస్త్రం నిర్థారించింది కాదని చెబుతున్నారు.

డాక్లర్లు వర్సెస్ వీరమాచినేని

డాక్లర్లు వర్సెస్ వీరమాచినేని

దీంతో ఇటీవల గుంటూరులో జరిగిన ఏపీ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ సదస్సులో పలువురు వైద్యులు వీరమాచనేని డైట్ ప్లాన్ పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అతడిని నకిలీ డాక్టర్‌గా పరిగణించి వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన వీరమాచినేని డైట్ ప్లాన్ సృష్టికర్త వీరమాచినేని రామకృష్ణ మాట్లాడుతూ కీటో డైట్‌ సరైనది కాదని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్‌ విసిరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైద్యవర్గాల నుంచి ఇప్పటివరకైతే ఏ ప్రతిస్పందన లేదని అంటున్నారు. కాబట్టి ఏతా వాతా తేలిందేమంటే...పేషెంట్లు ఈ వీరమాచినేని డైట్ ప్లాన్ వాడుతున్నంతకాలం వారికి రోగాలు తగ్గడం సంగతేమో కానీ డాక్టర్లకు మాత్రం బిపి పెరగడం ఖాయమనేదే!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In recent, a Diet Plan became most popular prepared by Veeramachineni Rama krishna is made embarrassing to Allopathic physicians.Number of Patients are questioning by consulting doctors whether they should use this diet plan or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more