టీడీపీలోకి వైసీపి ఎమ్మెల్యేకు ఆహ్వానం - సిద్దమేనా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ముఖ్య నేతలు పార్టీ మారుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వైసీపీ ఎంపీలు ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. వారితో పాటుగా తమ పార్లమెంటరీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో వేమిరెడ్డి సుదీర్ఘ మంతనాలు జరిపారు. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు.
ఎన్నికల వేళ టీడీపీ ఎంపీలు ముగ్గురు పార్టీని వీడారు. టీడీపీలో చేరుతున్నారు. నర్సారావు పేట ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు ఈ నెల 2న, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ నెల 3న, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైతం టీడీపీలో చేరనున్నారు. ఇందుకోసం తమ అనుచర గణాన్ని సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మహీధరరెడ్డితో చర్చలు జరిపారు. మహీధరరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. కందుకూరు సీటును మహీధర్ రెడ్డి స్థానంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌కు సీఎం జగన్ కేటాయించారు. దీంతో, మహీధర్ రెడ్డిని టీడీపీలోకి రావాలని వేమిరెడ్డి కోరినట్లు సమాచారం.

అయితే, మహీధర్ రెడ్డి నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ను కలిసిన సమయంలో తాను పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని మహీధర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు కొత్త ఇంఛార్జ్ బుర్రా మధుసూధన్ యాదవ్ కనిగిరిలో మహీధరరెడ్డి ని కలిసారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. తాను సహకరించే పరిస్థితి లేదని మహీధర్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. దీంతో, అసలు మహీధర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగుతారా లేక పార్టీ మార్పు పైన వచ్చిన ఆహ్వానంతో నిర్ణయం మార్చుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మహీధర్ రెడ్డికి పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ నెల 10న జరిగే సభకు కందుకూరు నుంచి హాజరు పైన పార్టీ నాయకత్వం చర్చలు చేస్తోంది. దీంతో...ఇప్పుడు మహీధర్ రెడ్డి నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications