వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెలిక: జగన్‌ను వెనకేసుకొచ్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు సర్టిఫికెట్ ఇచ్చారు. బహుశా తొలిసారి ఆయన జగన్‌ను వెనకేసుకొచ్చి ఉంటారు.

ఆయన ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన కాలమ్‌ జగన్‌కు అనుకూలంగా ఉంది. అది కూడా జగన్‌పై మోపిని సిబిఐ కేసుల గురించి కావడం విశేషం. అయితే ఆయన ఓ మెలిక పెట్టే ప్రయత్నం కూడా చేశారు. అటువంటి స్థితిలో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంంగా మారాయి.

సోనియాకు విధేయంగా ఉండి ఉంటే...

సోనియాకు విధేయంగా ఉండి ఉంటే...

జగన్‌పై పెట్టిన కేసులు రాజకీయ ప్రేరేపితాలని వేమూరి రాధాకృష్ణ దాదాపుగా తేల్చేశారు. సోనియా గాంధీకి విధేయంగా వ్యవహరించి ఉంటే కేసు ఉండేవి కావని కూడా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డపై పెట్టిన కేసులు కూడా అలాంటివేనని చెప్పేశారు. రాధాకృష్ణ ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

గాలి జనార్దన్ రెడ్డిపై ఇలా అన్నారు...

గాలి జనార్దన్ రెడ్డిపై ఇలా అన్నారు...

"కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడిని కాంగ్రెసులో చేరాల్సిందిగా యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాడు అధికారంలో ఉన్న దివంగత రాజశేఖర రెడ్డి స్వయంగా పూనుకుని ఆ నాయకుడిపై ఒత్తిడి తెచ్చారు. అయినా సదరు నాయకుడు లొంగలేదు. దీంతో ఆగ్రహించిన అప్పటి ఢిల్లీ పెద్దలు ఆయన మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐతో కేసు నమోదు చేయించారు" అని వేమూరి రాధాకృష్ణ రాశారు. ఇదంతా గాలి జనార్దన్ రెడ్డి గురించి ఆయన రాశారనే విషయం స్పష్టంగానే అర్థమవుతోంది.

 ఇకపోతే జగన్ గురించి ఇలా....

ఇకపోతే జగన్ గురించి ఇలా....

"మన దగ్గర జగన్మోహన్ రెడ్డి విషయమే తసుకుందాం! యన బుద్దిగా కాంగ్రెసు పార్టీలోనే కొనసాగి, సోనియా గాంధీకి విధేయత ప్రదర్శించి ఉటే సిబిఐ కేసుల్లో ఇరుక్కునేవాడు కాదన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే! ఈ రెండు సందర్బాలలోనూ సదరు వ్యక్తులు తప్పు చేశారా? లేదా? అని కాకుండా రాజకీయ కారణాలే వారిపై కేసులు నమోదు కావడానికి కారణాలే వారిపై కేసులు నమోదు కావడానికి కారణమయ్యాయి. అక్రమాలకు పాల్పడినా, రాజకీయంగా ఉపయోగపడితే కేులు కూడా ఉన్నవన్న మాట!" అని రాధాకృష్ణ రాశారు.

 మళ్లీ రాధాకృష్ణ ఇలా....

మళ్లీ రాధాకృష్ణ ఇలా....

"మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఉండి ఉండవచ్చు డీల్ కుదిరితే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి కేసులో ఇది వరకే రుజువైంది" అని రాధాకృష్ణ అన్నారు. డీల్ కుదరడం వల్లనే జగన్‌కు బెయిల్ వచ్చిందని కూడా ఆయన రాశారు. అందుకని ఏమవుతుందో రుజువైందని తర్వాత రాశారు. సోనియాతో డీల్ కుదిరింది కాబట్టే జగన్‌కు బెయిల్ వచ్చిందని రాశారు.

 అందుకే బెయిల్ వచ్చిందని...

అందుకే బెయిల్ వచ్చిందని...

జగన్‌కు బెయిల్ రావడానికి ముందు తాము దాఖలు చేసిన చార్జిషీట్‌కు భిన్నంగా కొన్ని సంస్థల్లో క్విడ్‌ప్రోకో జరగలేదని సిబిఐ అధికారులే స్వయంగా అఫిడవిట్ దాఖలు చేశారని, దంతో ఆయనకు బెయిల్ వచ్చిందని రాధాకృష్ణ రాశారు. ఇంతకాలానికి ఇప్పుడు ఎక్కడ ఏమి బెడిసికొట్టిందో తెలియదు గానీ క్రిడ్‌ప్రోకో జరగలేదని తాము దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకుంటున్నామంటూ సిబిఐ మరొక కొత్త అఫిడవిట్ దాఖలు చేసిందని, ఎటొచ్చీ రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగం లేనివారు మాత్ర అవినీతికి పాల్పడిన సందర్భాల్లో శిక్షకు గురవుతారని ఆయన రాశారు.

English summary
Debate is going on ABN Andhrajyothy Vemuri Radhakrishna comments on YS Jagan's CBI cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X