జగన్‌పై మారిన వేణు స్వామి స్వరం..కష్టాలు తప్పవంటూ..!

సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన.

దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి.

venu swamy intresting comments on ap cm jagan

టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి ముందే చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టైయ్యారు. ఇక ఏపీలో మరోసారి జగనే అధికారంలోకి వస్తారని వేణు స్వామి పలు ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది.తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు గెలుపు కొందరు కష్టమే అని తేల్చేశారాయన.

రోజా, అంబటి రాంబాబు, అమర్నాథ్ వంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని వేణు స్వామి తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని మరోసారి కుండబద్దలు కొట్టేశారు. అయితే జగన్ గెలిచిన తరువాత ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అది ఈడీనా లేక సీబీఐనా అనేది తాను చెప్పనని.. జగన్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత కొన్ని సమస్యలను ఫేస్ చేస్తారని ఆయన తెలిపారు. జగన్‌పై వేణు స్వామి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు అందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం జగన్ గురించి వేణు స్వామి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+