Venu swamy: నేనేం భగవంతుడిని కాదన్న వేణు స్వామి, జాతకాలపై సంచలన నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలలో టిడిపి కూటమి దూసుకుపోయింది. టిడిపి కూటమి ప్రభంజనానికి వైసిపి విలవిలలాడింది. ఏపీలో స్పష్టమైన మెజారిటీతో టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో, ఏపీలో టిడిపి ఓడిపోతుందని చెప్పిన వేణు స్వామి తాజాగా ఒక సందేశాన్ని రిలీజ్ చేశారు. తాను చెప్పిన లెక్క తప్పిందని, ఏపీలో వైసీపీ ఓటమి పాలైందని వేణు స్వామి పేర్కొన్నారు.

లెక్క తప్పిందన్న వేణు స్వామి
తాను జాతకాన్ని అనుసరించి మాత్రమే తన జ్యోతిష్య అంచనా చెప్పానని పేర్కొన్న వేణు స్వామి, తాను దేశంలో ఎన్డీఏ కూటమి ప్రాభవం తగ్గుతుందని చెప్పానని, అలాగే ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పానని పేర్కొన్నారు. అయితే తాను చెప్పినట్టే దేశంలో ఎన్డీఏ కూటమి ప్రాభవం తగ్గిందని, ఇక తాను వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పానని, ఏపీలో టిడిపికూటమి అధికారంలోకి వస్తుందని, ఈ విషయంలో తన లెక్క తప్పిందన్నారు వేణు స్వామి.

Venu Swamy sensational decision on horoscope predictions with Chandrababu victory

చంద్రబాబుకు వేణు స్వామి శుభాకాంక్షలు
దాంతో కచ్చితంగా తాను చెప్పిన లెక్క తప్పిందని ఒప్పుకుంటున్నాను అని, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెబుతున్నానని పేర్కొన్నారు. తన జ్యోతిష్య అంచనా తప్పినందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపిన వేణు స్వామి తనకు ఉన్న విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా, రాశుల ఫలితంగా మాత్రమే తాను జ్యోతిష శాస్త్ర అంచనాలు చెప్పానని వెల్లడించారు.

తనను ట్రోల్ చేస్తున్నారు .. అందరికీ క్షమాపణలు
వ్యక్తిగతంగా జాతకం చెప్పలేదని, గత కొన్ని రోజులుగా తనను కొంతమంది టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని, అయితే ఈ సమయంలో తనకు అండగా ఉన్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు. తాను నమ్మిన తిరుమల వెంకటేశ్వర స్వామిని, కామాఖ్య అమ్మవారిని ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నారని వేణు స్వామి పేర్కొన్నారు.

జగన్, చంద్రబాబు జాతకాలు విశ్లేషించటంలో ఫెయిల్ అయ్యాను
తానేమి భగవంతుడిని కానని, అయితే తాను చెప్పిన జ్యోతిష్య అంచనాలు అనేక సందర్భాలలో నిజమయ్యాయని, ఇది మాత్రమే లెక్క తప్పింది అన్నారు. తనని ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఆ ట్రోలింగ్ తాను ఆపలేను అన్నారు. వైయస్ జగన్ మరియు చంద్రబాబుల జాతకాలను విశ్లేషించడంలో తను ఫెయిల్ అయిన కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

ఇక ముందు ఆ జాతకాలు చెప్పను
ఇకముందు ఎప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో రాజకీయపరమైన జ్యోతిష్య విశ్లేషణలు కానీ, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగత విశ్లేషణలు కానీ, సెలబ్రిటీల జాతకాలు గాని, క్రికెట్ కు సంబంధించిన జాతక విశ్లేషణ గాని ఇకపై చేయబోనని వేణు స్వామి తన సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+