2026లో లోకేష్, పవన్ కళ్యాణ్ భవిష్యత్ ఇలా.. చంద్రబాబూ జాగ్రత్త.. అంటున్న వేణుస్వామి!
తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కరలేని పేరు వేణుస్వామి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు సంబంధించి జ్యోతిష అంచనాలతో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచే జ్యోతిష్యుడు వేణుస్వామి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లతో సహా పలువురు ప్రముఖుల జాతకాలపైన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
చంద్రబాబుకు వేణు స్వామి కీలక సూచనలు
2026లో వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పిన వేణు స్వామి చంద్రబాబుకు కీలక సూచనలు కూడా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతి అయ్యే అవకాశం లేదని వేణు స్వామి స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ఈ విషయం పైన ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అది జరగదని పేర్కొన్న వేణు స్వామి, చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేశారు.

లోకేష్ రాజకీయ భవిష్యత్ పై వేణుస్వామి
చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు కర్కాటకరాశి వారని, వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వేణుస్వామి పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఇదే వర్తిస్తుందని, ఆయన కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని వేణుస్వామి చెప్పారు. మంత్రి లోకేష్ భవిష్యత్తు పైన మాట్లాడిన వేణు స్వామి 2026సంవత్సరంలో మంత్రి నారా లోకేష్ కు పదోన్నతి కనిపిస్తోందని, డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు.
పవన్ కళ్యాణ్ కు ఈ ఏడాది ఉంటుంది ఇలా
ఏపీలో మరో డిప్యూటీ సీఎం ఉంటే తప్ప ఏమీ లేదని, ఆయన ఉన్న స్థాయి నుంచి మరో మెట్టు పైకి ఎక్కుతారని, లోకేష్ అభిమానులకు ఇది పండుగ అయినట్టు వేణు స్వామి చెప్పారు.
ఇక పవన్ కళ్యాణ్ జాతకం కూడా విశేషంగా ఉందని చెప్పిన వేణు స్వామి, కేటీఆర్, పవన్ కళ్యాణ్ లది మకర రాశి అని, పవన్ కళ్యాణ్ కు ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే అవకాశం ఇప్పట్లో లేదు
ఏపీలో కూటమి పార్టీలో ఎటువంటి సమస్యలు రావని, 2026సంవత్సరం అంతా సాఫీగా సాగిపోతుందని వేణుస్వామి జోస్యం చెప్పారు. 2027సంవత్సరంలో పవన్ కళ్యాణ్ కొన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేశారు. 2029వరకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉందో చూసి చెప్తానని చెప్పిన వేణుస్వామి, ప్రతి మనిషికి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జాతకాలు మారుతాయని స్పష్టం చేశారు.
2026లో జగన్ జాతకం ఇలా
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతకం పైన సానుకూలంగా స్పందించిన వేణు స్వామి 2026 లో ఆయనకు చాలా పాజిటివ్ గా ఉంటుందన్నారు. ఆయనది మిధున రాశి కావడంతో ప్రజల నుంచి ఆయనకు మద్దతు లభిస్తుందని, 2026లో పెద్దగా మార్పులేవీ ఉండవని, ఏపీ రాజకీయాలు కూల్ గా సాగిపోతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications