వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జి -పోలీసుల ముందు ఇలా నటించండి: అడ్డంగా దొరికిన టీడీపీ నేత : వీడియో లీక్..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్ నేత పోలీసులు - జడ్జిల ముందు ఏం చెప్పాలో సలహాలు ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన చేసిన కామెంట్స్ వీడియో బయటకు వచ్చింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు..ఇతర ముఖ్య నేతల సమక్షంలోనే కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లా అండ్ ఆర్డర్ రాజకీయంగా వాడుకుంటున్న తీరపైన పోలీసులు - జడ్జిల ముందు ఏం చెప్పాలో ఆయన సమావేశంలో వివరించారు.

పోలీసులను దుర్భాషలాడుతూ మాట్లాడారు. పోలీసులు ఫోన్ చేస్తే రికార్డు చేయాలని సూచించారు. కార్యకర్తలు పోలీసులను బెదిరించేలా, భయపెట్టేలా మాట్లాడాలని సలహా ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా "ఇంకో ముఖ్యమైన అంశం, మనలో ఎవరైనా కోర్టు ద్వారా విచారణకు వేళ్తే, అప్పుడు మేజిస్ట్రేట్ మిమ్మల్ని "మీకు ఏదైనా చెప్పాలని ఉందా?" అని అడుగుతారు. అప్పుడు పోలీసులు మిమ్మల్ని చెప్పరాని చోట కొట్టారని, విపరీతమైన నొప్పితో బాధపడుతున్నామని అబద్ధం చెప్పండి. నొప్పిగా ఉందని యాక్షన్ చేయాలంటూ సూచించారు. అప్పుడు ఖాకీలకు గుడ్డలు ఊడిపోతాయంటూ చెప్పుకొచ్చారు.

Video: TDP leader Chengalrayudu asks cadre to lie in court to strengthen the case, Gets trolled

ఈ చిన్న అబద్ధంతో కేసు గాలి లోకి పోతుందని పేర్కొన్నారు. పార్టీ ముఖ్య నేతల సమక్షంలోనే చెంగల్రాయుడు మాట్లాడిన మాటలు టీడీపీ శిబిరం నుంచే వీడియో రూపంలో బయటకు వచ్చాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెంగల్రాయుడు మాట్లాడిన మాటల సమయంలో చివర్లో చంద్రబాబు నిలువరించే ప్రయత్నం చేసినట్లుగా వీడియోలో స్పష్టం అవుతోంది. అయితే, పోలీసుల గురించి ప్రయోగించిన పదజాలం.. జడ్జి ముందు ఏం చెప్పాలో వివరించి ఇప్పుడు చెంగ్రలాయుడు ప్రత్యర్ది పార్టీలకు అస్త్రంగా మారారు.

English summary
TDP Senior Leader Chenglrayudu controversial Comments in party state level meeting became viral ఆయన చేసిన కామెంట్స్ వీడియో బయటకు వచ్చింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X