Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chintamaneni Prabhakar: గొర్రెల కాపరిపై చింతమనేని దాడి..Video Viral..!

రామచంద్రాపురం: మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఓ పేద గొర్రెలకాపరిపై తన ప్రతాపాన్ని చూపారు.పెదవేగి మండలం, రామచంద్రాపురం అడ్డరోడ్డు దగ్గర వీరంకి లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేశారు. తన జీడి మొక్కల దగ్గరకి గొర్రెలు వెళ్లాయంటూ, అటుగా వెళుతున్న చింతమనేని కారు దిగి, లక్ష్మీనారాయణ ను తిడుతూ ఆయన్ను కింద పడేసి గుండెల మీద తన్నడమే కాకుండా అతని గొర్రెలను దౌర్జన్యంగా తన కార్లో ఎక్కించుకొని తీసుకుపోయాడని లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశాడు. చింతమనేని తనను బెదిరించాడని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ దుర్భాషలాడినట్లు లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటన తెలిసిన వెంటనే, దెందులూరు నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షుడు మట్టా శంకర్ఆధ్వర్యంలో ప్రజలు రామచంద్రాపురం అడ్డరోడ్డుకు చేరుకొని చింతమనేని కారును అడ్డగించి నిలదీశారు. తాను కొట్టలేదని చెబుతూ అక్కడి నుంచి చింతమనేని మెల్లగా జారుకున్నాడు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల్లో రోడ్లు వేస్తున్నందుకు అడ్డుకున్నారని అటవీ సిబ్బందిని కొట్టడంతోబాటు ఇసుక దందాను ఆపినందుకు ఎమ్మార్వో పై దాడి చేశారు చింతమనేని.

Video:TDP leader Chintamaneni Prabhakar attacks poor shepherd case filed,here is why

మరో ఘటనలో ఎస్సీ సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ సామాజిక వర్గపు మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారు. "ఒరేయ్ మీ ఎస్సీ లకు ఎన్నికలు.. రాజకీయాలు ఎందుకురా... మేము రాజకీయాలు చేస్తాం .. మీరు జస్ట్ ఓట్లు వేయండి చాలు" అని బహిరంగ సభలో అహంకార పూరితంగా మాట్లాడారు చింతమనేని ప్రభాకర్.


మొత్తానికి చింతమనేనికి ఇంకా బలుపు తగ్గలేదని, ఈ ఎన్నికల్లో కూడా ఓడిస్తే తప్ప పొగరు కిందికి దిగదని ప్రజలు అంటున్నారు.ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చింతమనేని నియంత్రణ కోల్పోయి వ్యవహరించడాన్ని అక్కడి స్థానికులు తప్పుబట్టారు. చింత చచ్చినా పులుపు చావలేదని చెబుతూ చింతమనేని ఓడిపోయినా ఆయన తీరు మాత్రం మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+