కొత్త బిచ్చగాడిలా ఇలా రోడ్డున పడ్డావేంటి చంద్రం అన్నయ్యా?

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబును, నారా లోకేష్ ను పదేపదే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో వైసీపీ పై చేస్తున్న పోరాటంలో భాగంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, చంద్రబాబు వీడియోను పోస్ట్ చేసి మరీ ఆయన పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

వీధుల్లో డబ్బులు అడుక్కోవడం నీకే చెల్లింది బాబన్నయ్యా: సాయిరెడ్డి సెటైర్లు

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కొత్త బిచ్చగాడిలా రోడ్డున పడ్డాడని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి చంద్రం అన్నయ్య.. కొత్త బిచ్చగాడిలా ఇలా రోడ్డున పడ్డావేంటి? అంటూ సెటైర్లు వేశారు.

యువత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకు కప్పం కట్టాలంటూ నీ కుప్పిగంతులు యువతకు నచ్చట్లేదు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాయల్టీ కట్టాలని జనాలను అడుగుతావేంటి చంద్రమన్నయ్య అంటూ మండిపడిన విజయసాయిరెడ్డి అయినా ఇలా వీధుల్లో డబ్బులు అడుక్కోవడం నీకే చెల్లింది బాబన్నయ్యా అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

చంద్రబాబు సభలలో జనం కనిపించటం లేదు

చంద్రబాబు సభలలో జనం కనిపించటం లేదు

అంతేకాదు చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద స్పందన లేదని పేర్కొన్న విజయసాయిరెడ్డి, పచ్చ మీడియా పైత్యం తప్పా చంద్రబాబు సభలో జనం కనిపించడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. 100 కిలోమీటర్ల మేర జన ప్రవాహం అంటూ ఒక పత్రిక రాసిన వార్తను ఉటంకించి చేతికొచ్చింది రాయడం, నోటికొచ్చింది మాట్లాడ్డం పరిస్థితులపై కూడా భాగమే అయినా, ఇప్పుడు ఇది బాగా ముదిరిపోయింది అంటూ టార్గెట్ చేశారు. 2024లో కాయకల్ప చికిత్స చేయాల్సిందేనని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

మూడు రకాల క్షుద్ర పన్నాగాలను ప్రదర్శించే చంద్రబాబు

మూడు రకాల క్షుద్ర పన్నాగాలను ప్రదర్శించే చంద్రబాబు

అంతేకాదు చంద్రబాబు ఓటమి భయం వెంటాడినప్పుడల్లా మూడు రకాల రాజకీయాలు చేస్తాడంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మూడు రకాల క్షుద్ర పన్నాగాలను చంద్రబాబు ప్రదర్శిస్తారని చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు ఓడిపోతామని భావించినపుడు మూడు రకాల క్షుద్ర పన్నాగాలు ప్రదర్శిస్తారని అందులో సానుభూతి ఒకటని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దురాశతో తనపై తనే దాడి చేసుకోవడానికి చంద్రబాబు స్కెచ్ వేస్తాడని, అప్పట్లో మల్లెల బాబ్జీ ప్లాన్ ఇతనిదే అని చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు

చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు

ఇక రెండవది చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థి అపకారం తలపెడతారని, ఆఖరి అస్త్రంగా చంద్రబాబు డబ్బు కుమ్మరిస్తాడు అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ఐడియాలకు ఇప్పుడు కాలం చెల్లిందని విజయసాయిరెడ్డి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే చావు తెలివితేటలు ఉన్నవాడని అందరికీ తెలిసిన విజయసాయిరెడ్డి, చంద్రబాబు ఇది లాస్ట్ చాన్స్ అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై మరోసారి విరుచుకుపడ్డారు.

లాస్ట్ ఛాన్స్ రాష్ట్రానికా? నీకా? మైండ్ పోయిందా బాబు? అంటూ ప్రశ్నించినా విజయసాయిరెడ్డి మొన్నటి వరకు నాకు వయసు అయిపోయింది.. నాకు ఇదే లాస్ట్ చాన్స్ అన్నావు అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+