విజయవాడ- కాజీపేట మార్గంలో మూడో రైల్వే లైనుపై శుభవార్త!

రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ, కాజీపేట రైల్వే మార్గంలో 3వ లైన్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే విజయవాడ కాజీపేట మూడవ రైల్వే లైను అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ఖమ్మం నుండి డోర్నకల్ బైపాస్ లైన్ వరకు పనులు పూర్తి కావడంతో రైల్వే ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి వెళ్లారు.

మూడవ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి
ఈనెలాఖరులో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు తుది తనిఖీకి రానున్నారు. వారు కూడా రైల్వే లైన్ పరిశీలించి అంతా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే, పెండింగ్ ఉన్న మిగతా పనులను కూడా పూర్తి చేసిన తర్వాత ఈ మూడవ లైను అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ మూడవ లైను పనుల్లో డోర్నకల్ మహబూబాబాద్ మార్గం మాత్రమే మిగిలి ఉంది. ఈ పనులను త్వరలో చేపట్టనున్నారు.

vijayawada kazipet third railway line works completed it s ready to start operations

Take a Poll

కాజీపేట విజయవాడ మధ్య వినియోగంలోకి రానున్న మూడో రైల్వే లైన్
దీని తర్వాత నాల్గవ లైను నిర్మాణానికి సంబంధించిన కసరత్తును ప్రారంభించనున్నారు రైల్వే అధికారులు. ఈనెల 20వ తేదీన దక్షిణ మధ్య రైల్వే పి సి ఈఈ బ్రిజ్ మోహన్ మీనా ఈ రైల్వే లైను పనులను పరిశీలించారు. ఈ నెలాఖరులో సిఆర్ఎస్ దీనిని పరిశీలించి, దీని సామర్థ్యాన్ని నిర్ధారిస్తే కాజీపేట విజయవాడ మధ్య మూడో రైల్వే లైను వినియోగంలోకి వస్తుంది.

19సంవత్సరాల క్రితం మొదలైన ప్రతిపాదన
2006- 2007రైల్వేబడ్జెట్లో అప్పటికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మార్గాన్ని ప్రతిపాదించారు. దాదాపు 19సంవత్సరాల క్రితం తెరపైకి వచ్చిన ఈ రైల్వే లైను ఏర్పాటు కోసం అప్పటినుంచి ప్రతి బడ్జెట్లో దశలవారీగా నిధులు కేటాయిస్తూ వచ్చారు. ప్రస్తుతం మహబూబాబాద్ వరంగల్ 3వ లైన్ పైన కాకతీయ, సింగరేణి ఎక్స్ప్రెస్ లు నడుస్తున్నాయి. ఇక ఈ లైన్ పనులు పూర్తిగా జరిగితే రైళ్ల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు ఉండవు.

రద్దీ సమస్యకు మూడో లైన్ తో చెక్
ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు గూడ్స్ రైళ్ళు, ప్రయాణికులను చేరవేసే రైళ్ళు కావటంతో, దీన్ని తట్టుకోవడం కష్టంగా మారింది. ఒక్కొక్కసారి గూడ్స్ రైళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కోసం ప్రయాణికులను చేరవేసే ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ సమస్యను పరిష్కరించడం కోసం మూడవ రైల్వే లైన్ నిర్మాణం చేశారు. అంతేకాదు డోర్నకల్ మహబూబాబాద్ మార్గంలోని 24 కిలోమీటర్ల మేర రైల్వే పనులను కూడా త్వరలో చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+