Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vijayawada Lok Sabha Election 2024 Results LIVE: నాని Vs చిన్ని, గెలుపు దక్కేదెవరికి - ఎగ్జిట్ పోల్ నిజమయ్యేనా

విజయవాడలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా సాగింది. అక్కడ కేశినేని బ్రదర్స్ రెండు పార్టీల నుంచి పోటీ చేస్తున్నాయి. మోరా హోరీగా సాగిన ఎన్నికల సమరంలో గెలుపు ఎవరికి దక్కుతుందనే దాని పైన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తి కర విశ్లేషణ చేసాయి. బ్రదర్స్ లో గెలిచేదెవరో అంచనాకు వచ్చాయి. కానీ, కౌంటింగ్ వేళ రెండు వైపుల తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం అవుతోంది. లోలోపల మాత్రం ఆందోళన కొనసాగుతోంది. దీంతో..బ్రదర్స్ సమరంలో సత్తా చాటేదెవరు. విజేతగా నిలచేదెవరు.

బ్రదర్స్ మధ్య హోరా హోరీ
విజయవాడలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా సాగింది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ వీడి వైసీపీలో చేరారు. ఆయన వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా బరిలో నిలిచారు. నియోకవర్గంలో మారిన పరిస్థితుల్లో నాని గెలుపు ఖాయమని పార్టీ అంచనా వేసింది. నాని అప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, వైసీపీ సంక్షేమ ఓట్ బ్యాంక్, సామాజిక సమీకరణాలు నానికి కలిసి వస్తాయనే లెక్కలు వేసారు. అదే విధంగా విజయవాడ నగరంలో నాని హయాంలో చేసిన పనులు తిరిగి గెలుపుకు దోహదం చేస్తాయని భావించారు. దీంతో, ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ సీటు ఖరారు చేసింది.

AP election Results Vijayawada Lok Sabha Election 2024 Results voting counting live updates news in telugu

సమీకరణాలు కలిసొచ్చేదెవరికి
ఇటు..కేశినేని చిన్నికి సీటు ఖాయమైన సమయం నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జనసేన, బీజేపీకి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓట్ బ్యాంక్ పూర్తిగా తనకు మద్దతు ఇచ్చేలా అడుగులు వేసారు. ఆ రెండు పార్టీల నేతలతో సమన్వయంతో పని చేసారు. టీడీపీ అధినాయకత్వం చిన్నికి అండగా నిలవటంతో క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలు సైతం పూర్తిగా సహకరించారు. ఎన్నికల్లో కీలకమైన సమన్వయం ఎక్కడా దెబ్బ తినకుండా జాగ్రత్తగా అందరితో కలిసి పని చేసారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దులతో కలిసి ఎలక్షనీరింగ్ పక్కాగా అమలు చేసారు.

గెలుపు లెక్క పక్కా
పోలింగ్ సరళి గమనించిన తరువాత కేశినేని బ్రదర్స్ లో గెలుపు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మరింత పెరిగింది. రెండు వైపులా క్షేత్ర స్థాయిలో పోలింగ్ సరళి గురించి సమాచారం సేకరించి ఎవరికి వారు తమకు అనుకూలంగా లెక్కలు వేసుకున్నారు. గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ విజయవాడ ఫలితం పైన ఆసక్తికర విశ్లేషణ చేసాయి. జగన్ సంక్షేమం, సామాజిక సమీకరణాలు పని చేసాయని పేర్కొన్నారు. అదే సమయంలో జగన్ వ్యతిరేకత అర్బన్ ప్రాంతంలో స్పష్టంగా కనిపించిందని..మూడు పార్టీల పొత్తు విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి కలిసి వచ్చిందని విశ్లేషించారు. ఫలితంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయనే అంచనాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+