విజయవాడలో రేపు ఈ రూట్లలో అస్సలు వెళ్లకండి..! ట్రాఫిక్ అలర్ట్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నారు. కాబట్టి వాహనదారులు ఆయా రూట్లలో ప్రయాణాలు చేయకుండా ఆంక్షలు విధిస్తున్నారు.
విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వీఐపీలకు అసౌకర్యం కలుగకుండా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ తెలిపారు. కాబట్టి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నగర పౌరులకు విజయవాడ పోలీసు కమిషనర్ ట్రాఫిక్ పలు సూచనలు చేశారు.

ఇందులో ఉదయం 7 గంటల నుండి కంట్రోల్ రూమ్ వైపు నుండి బెంజ్ సర్కిల్ వైపుకు వెళ్ళు అన్నీ వాహనాలూ మళ్లిస్తారు.
ఆర్టీసీ వై జంక్షన్ నుండి ఏలూరు రోడ్ మీదుగా స్వర్ణ ప్యాలస్, దీప్తి సెంటర్ చుట్టుగుంట -గుణదల -రామవరప్పాడు రింగ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు ట్రాఫిక్ మళ్లిస్తారు. అలాగే బెంజ్ సర్కిల్ వైపునుండి బందర్ రోడ్ లోకి వచ్చే వాహనాలను బెంజ్ సర్కిల్ నుండి ఫకీర్ గూడెం- స్క్యూ బ్రిడ్జ్- నేతాజీ బ్రిడ్జ్- బస్టాండ్ వైపుకి మళ్లిస్తారు. రెడ్ సర్కిల్ నుండి ఆర్టీఏ జంక్షన్ , శిఖామణి సెంటర్ నుండి వెటరినరీ జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలూ అనుమతించరు.
అలాగే బెంజ్ సర్కిల్ నుండి బందరు రోడ్డులో డీసీపీ బంగ్లా జంక్షన్ వరకు ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు. ఆర్టీసీ బస్సుల్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బెంజి సర్కార్ వైపుకు అనుమతించరు. ఆర్టీసీ వై జంక్షన్ నుంచి బందరు రోడ్డు, రూట్ .నెం.5లో వెళ్ళే సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ వరకు వెళ్ళి అక్కడ నుండి బెంజ్ సర్కిల్ వైపుకు వెళతాయి. రేపు ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర వేడుకలకు హాజరయ్యే ఆహ్వానితుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఏఏ పాస్ ఉన్న వారు గేట్ నంబర్ 3 (ఫుడ్ కోర్ట్ ) నుంచి వచ్చి అక్కడే తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి. అలాగే ఏ1, ఏ2 పాస్ ఉన్న వారు గేట్ నంబర్ 4 (మీసేవ దగ్గర ఉన్న గేటు ) నుంచి లోపలికి వచ్చి వాహనాలు హ్యాండ్ బాల్ గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలి.

బీ1, బీ2 పాస్ లు ఉన్న వారు అవార్డులు తీసుకునేందుకు పాస్ ఇచ్చిన వారు, వారి కుటుంబాలు గేట్ నంబర్ 2 నుంచి వచ్చి ఫుట్ బాల్ గ్రౌండ్ లలేదా స్టేడియం ఎదురుగా ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలి. స్కూలు పిల్లలు, ఇతర ఆహ్వానితులు వాటర్ ట్యాంక్ రోడ్డు లోని గేటు నెం.6, 7 ద్వారా లోపలికి రావాలి.పాసులు కలిగిన ఆహ్వానితులు ఉదయం 8 గంటల లోపు స్టేడియం వద్దకు చేరుకోవాలి .












Click it and Unblock the Notifications