గణేషుడి సేవలో నేతలు: యువత తీన్‌మార్(పిక్చర్స్)
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వినాయక చవితి సందడి కనిపిస్తోంది. గల్లీకో మండపం, పలు రూపాల్లో కొలువైన గణనాథులు, పూజలు, భజనలు, నిమజ్జనోత్సవాలతో నగరం సందడిగా కనిపిస్తోంది. మూడో రోజు నుండి నిమజ్జనం ప్రారంభమైంది. పూజలు మొదలు నిమజ్జనం వరకు భక్తుల కోలాహలం, సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
వివిధ రూపాలలో వినాయకులు అలరిస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. గణపతిలను ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శనివారం నగరంలోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) తదితర చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఆయా ప్రాంతాల్లో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

నిమజ్జనం కోసం పోలీసులు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో వినాయక నిమజ్జనం నేపథ్యంలో శాంతి భద్రతల కోసం పోలీసులు...

నిమజ్జనం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో వినాయకుడిని నిమజ్జనం చేసే ముందు పూజలు చేస్తున్న భక్తులు.

నిమజ్జనం దృశ్యం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో భారీ వినాయకుడిని క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్న దృశ్యం.

వినాయక నిమజ్జనం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో భారీ వినాయకుడిని క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్న దృశ్యం.

వినాయకుడిన తరలిస్తూ..
హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో నిమజ్జనం చేసేందుకు వినాయకుడిని తీసుకు వెళ్తుండగా, భక్తులు మొక్కుతున్న దృశ్యం.

కోలాహలం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో భక్తుల కోలాహలం దృశ్యం.

నిమజ్జనం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో భారీ వినాయకుడిని క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్న దృశ్యం.

తీన్ మార్
హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు తీసుకు వెళ్తున్న సమయంలో భక్తుల యువత తీన్ మార్.

నెత్తిన..
హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో నిమజ్జనం చేసేందుకు ఓ యువతి నెత్తిన వినాయకుడిని పెట్టుకొని వెళ్తున్నారు.

ఖైరతాబాద్ గణపతి
59 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ గణపతి దృశ్యం. ఖైరతాబాద్ వినాయకుడికి తాపేశ్వరం నుండి నాలుగు వేల కిలోల భారీ లడ్డును తీసుకు వచ్చారు.

పిల్లల ఆనందం
హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో వినాయకుడి నిమజ్జనం నేపథ్యంలో సాగర తీరం వద్ద పిల్లల కోలాహలం దృశ్యం.

నెత్తిన గణపతి
హైదరాబాదులోని వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో నిమజ్జనం చేసేందుకు భక్తులు నెత్తిన వినాయకుడిని పెట్టుకొని వెళ్తున్నారు.

కెటిఆర్
హైదరాబాదులోని బతుకమ్మ కుంటలో గల వినాయకుడిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు.

దామోదర
హైదరాబాదు పరిసరాల్లోని బాలాపూర్ గ్రామంలో గల గణేషుడిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, తదితరులు.












Click it and Unblock the Notifications