Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video: బాలయ్య డైలాగ్ చెప్పిన ఇరాన్ సైనికుడు..! తర్వాత మృత్యుఒడికి..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్దం ప్రారంభించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టీ దీనిపై పడింది. ఈ యుద్దం జరుగుతున్న సమయంలో ఇరాన్ తమపై చేస్తున్న ప్రతీకార దాడుల్లో భారీ నష్టాలు చవిచూస్తున్న అమెరికా.. ఆ కోపంతో భారత్ కు వచ్చి వెళ్తున్న ఓ ఇరాన్ నౌకను తమ జలాంతర్గామి సాయంతో ముంచేసింది. విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 (milan 2026) నేవీ విన్యాసాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈ నౌక తిరిగి వెళ్తుండగా అమెరికా హిందూ సముద్రంలో ఢీకొట్టి ముంచేసింది. ఇందులో 100 మందికి పైగా ఇరాన్ నేవీ అధికారులు చనిపోయారు.

అయితే ఆ మునిగిపోయిన నౌకలో ఉన్న ఓ ఇరాన్ నేవీ అధికారి దానికి కొన్ని రోజుల ముందే విశాఖపట్నంలో జరిగిన నేవీ విన్యాసాల్లో పాల్గొన్న సమయంలో స్థానిక యూట్యూబర్ కు ఇచ్చిన ఓ వీడియో వైరల్ (viral video)అవుతోంది. ఇందులో అతను తన అభిరుచుల్ని పంచుకోవడంతో పాటు సదరు యూట్యూబర్ కోరిక మేరకు చెప్పిన బాలయ్య సినీ డైలాగ్ కూడా వైరల్ అవుతోంది. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటూ బాలయ్య చెప్పే సినీ డైలాగ్ ను ఇరాన్ సైనికుడు యూట్యూబర్ చెప్పినట్లే చెప్పి అలరించాడు.

Viral Clip to Tragedy Iranian Navy Officer Dies in US-Sunk Ship After Sharing Balakrishna Dialogue

అయితే ఆ తర్వాత అనూహ్యంగా ఈ నౌక తిరిగి ఇరాన్ కు బయలుదేరడం, మధ్యలో శ్రీలంక సమీపంలో దాన్ని అమెరికా జలాంతర్గామి సాయంతో ఢీకొట్టి ముంచేయడం జరిగిపోయాయి. దీనిపై భారత్ తొలుత స్పందించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. చివరికి ఆ నౌకను కాపాడేందుకు తాము ప్రయత్నించినట్లు భారత్ వివరణ ఇచ్చింది. అటు శ్రీలంక మాత్రం ఈ నౌకలో ఉన్న పలువురు ఇరాన్ నేవీ అధికారుల్ని కాపాడి ఆస్పత్రులకు తరలించి మానవత్వం చాటుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+