Viral Video: అదుపుతప్పి కాల్వలో పడ్డ కోనసీమ కలెక్టర్..!
ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఇవాళ ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రతీ ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే పడవ పోటీల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించేందుకు నేరుగా కాలువలోకి బోట్ లో వెళ్లారు. అయితే మధ్యలో ఈ బోట్ అదుపు తప్పడంతో ఆయన నీళ్లలో పడిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం పులిదిండిలో ప్రతీ ఏటా సంక్రాంతి సందర్భంగా పడవ పందాలు నిర్వహిస్తుంటారు. వీటికి చుట్టుపక్కల ఊర్ల నుంచి జనం కూడా భారీ తరలివస్తుంటారు. దీంతో ప్రభుత్వం ప్రతీ ఏటా ఈ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తుంది. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇవాళ పడప పోటీల ట్రయల్ రన్ చూసేందుకు అక్కడికి వెళ్లారు. బయట నుంచే చూడకుండా బోట్ ను స్వయంగా నడుపుతూ కాల్వలోకి వెళ్లారు.

సంక్రాంతి సంబరాల్లో ప్రమాదం.. కాలువలో పడిపోయిన కలెక్టర్
— ChotaNews App (@ChotaNewsApp) January 2, 2026
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పడవ పోటీల ట్రైల్ రన్లో అపశృతి చోటుచేసుకుంది. పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ప్రయాణిస్తున్న పడవ అదుపు… pic.twitter.com/iumqWH6qav
ఈ సమయంలో కలెక్టర్ నడుపుతున్న బోటులో ముగ్గురు ఉన్నారు. అలాగే చుట్టూ ఇతర బోట్లలోనూ మత్సకారులు, అధికారులు ఉన్నారు. కలెక్టర్ లైఫ్ జాకెట్ కూడా ధరించారు. అయితే ఆయన నడుపుతున్న పడవ ఒక్కసారిగా అదుపు తప్పడంతో హఠాత్తుగా మహేష్ కుమార్ నీళ్లలో పడిపోయారు. దీంతో అప్రమత్తమైన ఇతర పడవల్లో స్విమ్మర్లు వెంటనే సమీపానికి వచ్చి ఆయన్ను కాపాడారు. అనంతరం సురక్షితంగా ఒడ్డుకు తీసుకెళ్లారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.












Click it and Unblock the Notifications