అదిరిపోయే లుక్ లో విశాఖ రైల్వే స్టేషన్: కొత్త లైన్లు, ప్లాట్‌ఫారాలు- ఆ కష్టాలకు చెక్..!!
విశాఖ రైల్వే స్టేషన్ కొత్త లుక్ తో సిద్దం అవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిగా స్టేషన్ ను ఆధునీకరిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక స్టేషన్ బయట రైళ్ల గంటల తరబడి నిరీక్షణ ముగియనుంది. కొత్త లైన్లతో పాటుగా కొత్తగా ప్లాట్ ఫారాల సంఖ్య పెరుగుతోంది. వీటిని పూర్తి చేయటానికి కాల పరమితి ఖరారు చేసారు.
విశాఖపట్నం అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం రోజూ సుమారు 80 వేల మంది ప్రయాణిస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణీకులు.. రైళ్ల సంఖ్యకు అనుగుణంగా పూర్తిగా రూపు రేఖలు మారిపోనున్నాయి. ప్రయాణికు లకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

రూ.299 కోట్లతో విశాఖ కోచింగ్ యార్డు ఆధునికీకరణకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో స్టేషన్ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుంది. అదే విధంగా విశాఖ కోచింగ్ యార్డును పూర్తిగా పునర్వ్యవ స్థీకరించనున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం స్టేషన్‌లోని ప్లాట్ ఫారంలు 8 నుంచి 14కు పెంచుతున్నారు. ఆరు కొత్త లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
కాగా, ప్రస్తుత యార్డు నిర్మాణం కారణంగా టెర్మినేటింగ్ రైళ్లు, ఇతర రైళ్లు ఒకే మార్గాలను దాటాల్సి వస్తోంది. దీనివల్ల అప్రోచ్ సిగ్నళ్ల వద్ద రైళ్లు నిలిచిపోవడం, ప్లాట్‌ఫారాల లభ్యత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయితే ఇక రైళ్ల వెయిటింగ్ అవసరం ఉండదు. తూర్పు వైపు కొత్త ప్రవేశ ద్వారం నిర్మించడంతో పాటు ప్రయాణికుల రిజర్వేషన్ కేంద్రా న్ని కూడా కొత్త ప్రదేశానికి తరలించనున్నారు.
విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను ఎంపీ భరత్ పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్, రైల్వే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ సౌకర్యాలు పెరుగుతాయని అన్నారు. 450 కార్లు, 2000 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునేలా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. విశాఖ రైల్వేస్టేషన్ దేశంలోనే బెస్ట్ రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందాలని స్పష్టం చేసారు.














Click it and Unblock the Notifications
