వివేకా షమీమ్ ల లవ్ స్టోరీ: ఆసక్తికర అంశాలు!!
వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకానందరెడ్డి షమీమ్ ల మధ్య లవ్ స్టోరీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజలలోనూ చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ షమీమ్ ఎవరు? వివేకానందరెడ్డికి ఆమెతో ఎలా పరిచయం? వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది? వివేకానంద రెడ్డి ముస్లింగా పేరు మార్చుకుని మరీ ఆ మహిళను రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? అన్నది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
వివేకానంద రెడ్డి 2010లో షమీమ్ అనే ముస్లిం మహిళను రెండోపెళ్లి చేసుకున్నారు. వివేకానంద రెడ్డికి పెళ్లయ్యింది. ఆయన కుమార్తెకు కూడా పిల్లలు పుట్టిన లేటువయసులో వివేకానందరెడ్డి మళ్లీ ప్రేమలో పడ్డారు. 2005లో డాక్టర్ రెడ్డీస్ ఉద్యోగం కోసం షమీమ్ అనే మహిళకు వివేకానందరెడ్డి రికమండేషన్ లెటర్ ఇచ్చారు. అయితే ఉద్యోగానికి ఆమెను సెలెక్టు చేయకపోవడంతో డాక్టర్ రెడ్డీస్ ఆఫీసుకు వెళ్లి నేరుగా మాట్లాడిన వివేక షమీమ్ కు ఉద్యోగం ఇప్పించారు.

అప్పటి నుండి వివేకానందరెడ్డికి, షమీమ్ కు మధ్య పరిచయం పెరిగింది. ఇక తరచు ఫోన్లో మాట్లాడుకోవడం కూడా మొదలైంది. ఆ తర్వాత 2007లో వివేకానంద రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారని, అయితే మొదట తాను వివేకానంద రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని షమీమ్ చెబుతున్నారు.
తన భార్య అనారోగ్య సమస్యలతో ఉండి తనను పట్టించుకోవడం లేదని వివేకానంద రెడ్డి చెప్పడంతో కన్విన్స్ అయిన షమీమ్ అక్టోబర్ 3వ తేదీ 2010న హైదరాబాదులో వివేకానంద రెడ్డి ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కోసం మహమ్మద్ అక్బర్ గా ఆయన తన పేరు మార్చుకున్నారని, తనను పెళ్లి చేసుకున్న తర్వాత వివేకానంద రెడ్డికి బాగా కలిసొచ్చిందని షమీమ్ చెప్పారు. ఆ తర్వాత వివేకాకు మంత్రి పదవి వచ్చిందని చెప్పారన్నారు.

షమీమ్ బావ భాషాను వివేక తన పీఏగా పెట్టుకున్నారని తన పెళ్లి విషయం తెలుసుకున్న సునీత బావ శివ ప్రకాష్ రెడ్డి తనను, తన బావ భాషాను బెదిరింపులకు గురి చేశారని తెలిపింది. వివేకానంద రెడ్డిని వదిలి పెట్టకపోతే అంతు చూస్తామని శివ ప్రకాష్ రెడ్డి బెదిరించారని ఈ విషయం తెలిసిన వివేకానందరెడ్డి శివ ప్రకాష్ రెడ్డిని కాలర్ పట్టుకుని నిలదీశారు అని చెప్పింది.
వీరిద్దరి వ్యవహారం వైఎస్ కుటుంబానికి తెలుసనీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా తెలుసని, ఆయన వివేకాను జాగ్రత్తగా ఉండమని చెప్పారని పేర్కొంది. ఆపై 2015లో తాను షెహన్ షా కు జన్మనిచ్చానని కొడుకును చూసి వివేకానందరెడ్డి మురిసిపోయారు అని పేర్కొంది. ఇక తమ పెళ్లికి సంబంధించి, ఆ తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది షమీమ్.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications