జిల్లా కోసం ఎమ్మెల్యే చిన్నారెడ్డి దీక్ష, అరెస్ట్: జెసిపై కేసు
మహబూబ్‌నగర్/అనంతపురం: గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వనపర్తిని ప్రత్యేక జిల్లా చేయాలని చిన్నారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని వనపర్తిలోని ఎన్‌వీఎన్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్న నేపథ్యంలో వనపర్తిని కూడా జిల్లా చేయాలని చిన్నారెడ్డి దీక్ష చేశారు.

జెసి ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం: తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌బిఐ ఏటిఎం వద్ద చెత్త పడేశారని సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో బ్యాంక్ అధికారులు జెసి ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై 506, 353 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మంగళవారం ఉదయం జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తమ నేతపై కేసు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తలొగ్గిన బ్యాంకు సిబ్బంది జెసి ప్రభాకర్ రెడ్డిపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications