తిరుమల తిరుపతి దేవస్థానంను తాకిన ఉత్తర కొరియా వాన్నాక్రై

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: ప్రపంచాన్ని బెంబేలెత్తించిన ఉత్తర కొరియా లాజరస్ గ్రూప్ ర్యాన్సమ్ వేర్ వాన్నాక్రై బారిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పడింది. టిటిడికి చెందిన సుమారు ఇరవై కంప్యూటర్లు ఈ వైరస్‌ బారిన పడి హ్యాక్ అయినట్టు తెలుస్తోంది.

అయితే ఈ సైబర్ దాడి కేవలం పరిపానలనా పరిమైన అంశాలకు సంధించిన కంప్యూటర్లకు మాత్రమే పరిమితం కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఈ సైబర్ ఎటాక్ వల్ల భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై ఎలాంటి ప్రభావం లేదని తెలిపారు.

అత్యుత్తమ ప్రమాణాల సాఫ్టువేర్ వినియోగించినా..

అత్యుత్తమ ప్రమాణాల సాఫ్టువేర్ వినియోగించినా..

టిటిడి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌‌వేర్‌‌ను వినియోగిస్తోంది. అయినప్పటికీ సైబర్ హ్యాకింగ్‌కు గురికావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్‌ సాఫ్ట్‌‌వేర్‌‌ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన కారణంగా ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకున్నారు

జాగ్రత్తలు తీసుకున్నారు

సైబర్ అటాక్ అంశం తెలియగానే ఐటీ విభాగం ఆ కంప్యూటర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, మిగతా కంప్యూటర్లకు ఆ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ నిలిపివేత

తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ నిలిపివేత

ఇదిలా ఉండగా, ర్యాన్సమ్‌ వేర్‌ సైబర్‌ వైరస్‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం సచివాలయంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. తనిఖీల అనంతరం బుధవారం మళ్లీ సేవలను పునరుద్ధరించే అవకాశముందని అధికారులు తెలిపారు.

కేటీఆర్ ఆదేశాలతో..

కేటీఆర్ ఆదేశాలతో..

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణలో ఇప్పటికే చేపట్టిన సైబర్‌ భద్రత చర్యల కారణంగా వైరస్‌ ప్రభావంలేదని, అయినా ముందుజాగ్రత్తగా కంప్యూటర్లు, ఇతర నెట్‌ పరికరాలకు వైరస్‌ వ్యాపించకుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Wanna Cry effect on Tirumala Tirupati Devasthanam computers.
Please Wait while comments are loading...