బుగ్గన వర్సెస్ యనమల-ఆర్ధిక పరిస్ధితిపై చర్చకు సవాల్, ప్రతిసవాల్..
ఏపీ ఆర్దిక పరిస్ధితిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ఇవాళ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విపక్ష టీడీపీకి ఓ సవాల్ విసిరారు. దానికి స్పందించిన మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు దీనికి ప్రతిసవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు కూడా చేసుకున్నారు. దీంతో ఈ ఆరోపణల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
ఇవాళ విజయవాడలో జీఎస్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతా రాహిత్యమని బుగ్గన విమర్శించారు. పాలన రాకపోతే గడచిన నాలుగేళ్లు గా పన్ను వసూళ్లు ఎలా పెరుగుతున్నాయని ప్రశ్నించారు.ఎప్పుడో ఒకసారి మాత్రమే వేతనాలు ఆలస్యం అయ్యాయి అంతేనన్నారు. కోవిడ్ కష్టాలు ఉన్నప్పటి కి ఎక్కడా సామాజిక పెన్షన్లు ఆలస్యం కాలేదన్నారు.

అలాగే ఏపీ ఆర్థిక పరిస్థితి పై విపక్ష నేత చంద్రబాబు, మాజీ ఆర్ధికమంత్రి యనమల తలోమాట మాట్లాడుతున్నారని బుగ్గన విమర్శించారు. ఆర్థిక పరిస్థితి పై వారిద్దరితోనూ బహిరంగ చర్చకు సిద్దమన్నారు. పథకాలు ఇస్తే ఉచితాలు అంటున్నారని,టీడీపీ ఇచ్చిన హామీలు ఉచితాలు కావా అని ప్రశ్నించారు. తమ కంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారని బుగ్గన ఆక్షేపించారు.
మరోవైపు బుగ్గన వ్యాఖ్యలపై మాజీ ఆర్ధిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు వస్తే.. తాము సిద్ధమని గతంలోనే చెప్పామని, దానికి కట్టుబడి ఉన్నామని యనమల తెలిపారు. చర్చకు రమ్మని చెప్పిన ముఖ్యమంత్రి ఎందుకు బయటకు రావడం లేదన్నారు. ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అడ్డగోలుగా అబద్దాలు చెప్పి వెళ్లిపోవడం కాదని, దమ్ముంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై చర్చకు రావాలన్నారు.
గత ప్రభుత్వంపై నిందలేయడానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా ముఖ్యమంత్రికి బుద్ధి ఉండాలని యనమల విమర్శించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని, ఆదాయం పెరిగిందని, గతంలో కంటే అప్పులు తగ్గాయనే నమ్మకం ఉంటే జగన్ రెడ్డి చర్చకు రావాలన్నారు. అంతేగానీ, చర్చకు రావాలని చెప్పి తప్పించుకోవడం మానుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించే పరిస్థితులు నెలకొన్నాయని, ఏ రాష్ట్రానికైన ఆర్దిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమన్నారు. కానీ జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ అనే మాటకు అర్ధం కూడా తెలియదన్నారు.
-
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
LPG: ఏపీలో గ్యాస్ పరిస్ధితి ఇదీ- తేల్చేసిన చంద్రబాబు..! -
కొత్త ఇళ్ల పై ప్రభుత్వం గుడ్ న్యూస్- అర్హుల జాబితా సిద్దం, పంపిణీ ఇలా..!! -
‘మెగా’ గుడ్ న్యూస్: ఇక 21 రకాల వైకల్యాలకు ‘సదరం’ సర్టిఫికెట్లు! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఏపీకి ఈ బెనిఫిట్.. ఫోకస్ చెయ్యమన్న సీఎం చంద్రబాబు -
రైతుబజార్ కూరలు ఇక ఇంటికే, ఇలా చేస్తే చాలు- అక్కడి ధరలకే అన్ని ఉత్పత్తులు..!! -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే!












Click it and Unblock the Notifications