'బాబు కాలర్ పట్టుకుంటే జగన్ చేయి తీసేస్తాం', 'పవన్ వ్యాఖ్యల్లో స్పష్టత లేదు'

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కాలర్‌ను పట్టుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేయి తీసేస్తామి తెలుగుదేశం పార్టీ నేత రాజేంద్రప్రసాద్ ఆదివారం నాడు హెచ్చరించారు.

బంద్ సక్సెస్, అవసరమైతే చంద్రబాబు కాలర్ పట్టుకుంటాం: జగన్

చంద్రబాబు కాలర్ పట్టుకుంటామని జగన్ చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు ఏమిటన్నారు. అసెంబ్లీలో జగన్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్, వైసిపి నేతలు అసెంబ్లీ ప్రతిష్టను భ్రష్టు పట్టించారన్నారు. జగన్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే, ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

We will cut YS Jagan hand: TDP

వెంకయ్య, చంద్రబాబులు ఉండటం అదృష్టం: డొక్కా

కేంద్రంలో వెంకయ్య, ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబులు ఉండట ఏపీ అదృష్టమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్యాకేజీ సరైంది అన్నారు. వెంకయ్య పైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో స్పష్టత లేదన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు ఏమాత్రం బాగా లేదన్నారు.

వెంకయ్య ఇల్లు ముట్టడి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నెల్లూరులో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇంటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు ఆదివారం నాడు ముట్టడించారు. మంత్రి ఇంటికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+