Weather: ఏపీలో తేలికటపాటి నుంచి భారీ వర్షాలు, అల్పపీడనం, ఉపరితల ఆవర్తం ప్రభావం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు మరికొద్ది రోజులపాటు కొనసాగనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో బుధవారం ఏర్పడినటువంటి అల్పపీడనం, ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.

ఏపీలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు
ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. రాగల 48 గంటలలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఒక ఉపరితల ద్రోణి శ్రీలంక తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంనకు అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. అల్పపీడనం, ఉపరిత ఆవర్తనం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర, దక్షిణ కోస్తాలో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
గురువారం యానాం, ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలో గురువారం ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఒకటి లేక రెండు ప్రదేశాలలో భారీ నుండి అతిభారీ వర్షాలుతో పాటు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శనివారం దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Recommended Video

రాయలసీమలోనూ భారీ వర్షాలు
ఇక రాయలసీమలో గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం, ఆవర్తన ప్రభావంతోపాటు ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications