ఎమ్మెల్యే శ్రీదేవి కుల వివాదం విచారణ చేసిన జేసీ: ఏం చెప్పారో తెలుసా ?
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుల వివాదానికి సంబంధించి విచారణ చేశారు జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్. ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని ఫిర్యాదు అందిన నేపధ్యంలో ఈసీ ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ విచారణ జరిపారు. గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ ఎదుట తన కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరైన శ్రీదేవి జాయింట్ కలెక్టర్ కు తన కులానికి సంబంధించిన ఆధారాలతో కూడిన ధృవ పత్రాలు సమర్పించారు.
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ కాదంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం శ్రీదేవి పై జిల్లా కలెక్టర్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు అప్పటి సీఎస్ కు లేఖ రాశారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నుండి వచ్చిన లేఖ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఉండవల్లి శ్రీదేవిని విచారణను ఎదుర్కొన్నారు. దీనితో ఆమె అన్ని వివరాలతో విచారణకి హాజరయ్యారు.

శ్రీదేవికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. తన మెడిసిన్ సర్టిఫికెట్లను ఆమె జెసి దినేష్ కుమార్ కి అందించారు . వైద్యురాలిగా చేసిన సర్వీసును కూడా పత్రాలతో సహా సాక్ష్యాలుగా చూపించారు. ఇక ఆమెను విచారించిన జేసీ విచారణకు ఎమ్మెల్యే శ్రీదేవి సహకరించారని,ఆమె తన కులాన్ని నిరూపించుకోటానికి కావాల్సిన అన్ని వివరాలు, ఆధారాలు అందించారని , ఆమె ఇచ్చిన పత్రాలను క్రాస్ చెక్ చేసిన తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి కులం విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications