వైసీపీ ఎంపీల పోరులో తలదూర్చిన చంద్రబాబు-సీన్ కట్ చేస్తే ? వాచిపోయిందిలా..

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో అప్పుడప్పుడూ అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. మరికొన్ని అందరూ ఊహించే విధంగానే జరుగుతుంటాయి. కానీ ఏ పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించిన నేతల్ని పొగిడినా, తెగిడినా అందులో ఆశ్చర్యం లేదు. కానీ పక్క పార్టీల వాళ్లు అదే పనిచేస్తే ఆ వ్యవహారం కచ్చితంగా వార్తల్లోకి ఎక్కుతుంటుంది. ఇలాంటిదే తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. ఇందులో చంద్రబాబు ఇరుక్కున్నారు.

 వైసీపీ ఎంపీల పోరు

వైసీపీ ఎంపీల పోరు

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఏపీలో భారీ ఎత్తున ఎంపీల్ని గెల్చుకుంది. అయితే గెలిచిన తర్వాత ఆ పార్టీ ఎంపీల్లో పలువురికి పరస్పరం పొసగడం లేదనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇందులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామష్ణంరాజుకు మిగతా ఎంపీలతో అస్సలు పొసగదనే విషయం మాత్రం అందరికీ తెలిసిందే. దీంతో రఘురామ విషయంలో వారు దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఇక మిగతా పార్టీల నేతలు మాత్రం రఘురామకు కాస్త అంటకాగడం కూడా సహజంగానే జరుగుతోంది. ఇదే క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ రఘురామకు అండగా నిలుస్తుండగా.. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాట పట్టారు.

 రఘురామకు చంద్రబాబు అండ

రఘురామకు చంద్రబాబు అండ

వైసీపీతో విభేదిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇప్పటికే టీడీపీ అండ ఉందనే అంతా భావిస్తుంటారు. వైసీపీ నేతలు కూడా పలుమార్లు ఇవే ఆరోపణలు చేశారు. అయితే తాజాగా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. రఘురామ గురించి సానుకూలంగా వ్యాఖ్యలు చేశారు. స్ధానిక ఎంపీ అయిన రఘురామరాజును ఆయన స్వస్ధలానికి రానివ్వకుండా జగన్ సర్కార్ అడ్డుకుంటోందన్నారు. అంతటితో ఆగకుండా ఆయనపై హత్యాయత్నం జరిగిందని కూడా ఆరోపించారు. ఈ విషయాన్ని తానే గవర్నర్ కు చెప్పానన్నారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

 చంద్రబాబును ఏకేసిన సాయిరెడ్డి

చంద్రబాబును ఏకేసిన సాయిరెడ్డి

గోదావరి వరద ప్రాంతాల పర్యటనలో స్ధానిక ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మద్దతుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రెబెల్ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఓ ఫ్రాడ్ ఎంపీని ఇంద్రుడు, చంద్రుడని పొగుడుతున్నారంటూ ఆక్షేపించారు. నియోజకవర్గంలో అఢుగుపెట్టలేని వారికి భజన చేస్తున్నారంటే టీడీపీ నేతల బలహీనత అర్ధం చేసుకోవచ్చంటూ సాయిరెడ్డి విమర్శించారు. సీఎంగా ఉండగా తమ వాళ్లు పనికిరారని భావించి పక్క పార్టీ వారికి పదవులిచ్చి 23కి పడిపోయారంటూ చంద్రబాబును దెప్పిపొడిచారు. - ఇక అథఃపాతాళానికే అంటూ చివర్లో ఓ కామెంట్ కూడా చేశారు. దీంతో సాయిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతువ్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+