పార్టీ మారినా కలిసిరాలేదా, ఆనం సోదరుల భవితవ్యమేమిటీ?

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రాత్రికి రాత్రే రాజకీయాలను మార్చే సత్తా ఉన్న ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో చేరారు. అయితే టిడిపి నాయకత్వం మాత్రం ఆనం సోదరులకు ఇచ్చినా హమీని నెరవేర్చలేదని ఆనం వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మగాడినై రెచ్చిపోతా, నన్ను కట్ చేస్తే ఏపీనే కట్ చేస్తా: మాణిక్యాలరావు సంచలనం

అయితే కాలం కలిసిరానందున ఆనం సోదరులు కూడ సమయం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు టిడిపి నాయకత్వం కూడ ఆనం సోదరులకు ఇచ్చిన హమీని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

చచ్చినా వైసీపీలో చేరను, ఆత్మాభిమానం చంపుకోలేను: ఎంపీ కొత్తపల్లి గీత

ఆనం సోదరుల్లో ఒకరికి త్వరలోనే పదవి దక్కే అవకాశం ఉందని ఆనం వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.ఆనం సోదరులకు మంచి పదవి కోసం ఆయన వర్గీయులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

నెల్లూరులో వైసీపీని దెబ్బతీయడమెలా

నెల్లూరులో వైసీపీని దెబ్బతీయడమెలా

నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంటుంది. అయితే వైసీపీని దెబ్బతీయడానికి ఆనం సోదరులకు మంచి పదవిని ఇస్తే ప్రయోజనంగా ఉంటుందని ఆనం వర్గీయులు భావిస్తున్నారు. నెల్లూరు నుండి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.గత ఏడాది ఏప్రిల్ లో మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది.అయితే నెల్లూరులో వైసీపీని దెబ్బతీయడానికి ఆనం సోదరులకు పదవిని టిడిపి నాయకత్వం కట్టబెట్టే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం సాగుతోంది.

టిడిపి ప్లాన్ ఇలా

టిడిపి ప్లాన్ ఇలా


వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో ఆ పార్టీని నిలువరించేందుకు చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.2019 ఎన్నికల్లో టిడిపి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహన్ని అమలు చేస్తున్నారు. వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వనిస్తున్నారు. కర్నూల్, నెల్లూరు, కడప చిత్తూరు లాంటి జిల్లాల్లో వైసీపీ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకొని టిడిపి పావులు కదుపుతోంది. అయితే అదే సమయంలో నెల్లూరు జిల్లాల్లో ఆనం సోదరులకు కూడ పదవులను కట్టబెట్టే అవకాశం ఉందని ప్రచారం కూడ లేకపోలేదు

టిడిపి, బిజెపి నేతల మధ్య సమన్వయం లేదు

టిడిపి, బిజెపి నేతల మధ్య సమన్వయం లేదు

నెల్లూరు జిల్లాలో టిడిపి, బిజెపి నేతల మధ్య కూడ సమన్వయం లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. దీని కారణంగా కూడ విపక్ష వైసీపీకి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విపక్షాన్ని నిలువరించడంతో పాటు మిత్రపక్షాన్ని కలుపుకొనిపోయేందుకు తీసుకోవాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వం గుర్తు చేస్తోంది. అయితే ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anam family has got decades of political history in the Nellore District and this family members served as ministers in the cabinet, except the post of Chief Minister. Now, there is a huge debate about the political future of Anam brothers in this district,

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి