వాట్సప్ అకౌంట్స్ హ్యాక్ .. ఆ తర్వాత జరిగేది తెలిస్తే మీరు షాక్!

రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఫోన్ కాల్స్ చేసి ఓటిపి లు వచ్చాయని, బ్యాంకుల నుండి కాల్ చేసినట్టు, ఆధార్ అప్డేట్ చేసుకోండి అని చెప్తున్నట్టు ఇలా రకరకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మరో కొత్త సైబర్ మోసానికి ఒడిగట్టారు.

వాట్సప్ హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు
ఏకంగా whatsapp అకౌంట్లను హ్యాక్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. whatsapp అకౌంట్ల ద్వారా సదరు వ్యక్తికి కాంటాక్ట్ లో ఉన్నవారికి చాలా నమ్మకం కలిగేలాగా డబ్బులు కావాలని మెసేజ్ పెడుతూ, సైబర్ మోసాలను చేస్తున్నారు. ఇటీవల కాలంలో హన్మకొండలో ఇటువంటి బాధితులు పెరిగిపోయారు.

whatsapp accounts hack cyber frauds asking money from whatsapp accounts

Take a Poll

వాట్సప్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్న సైబర్ నేరగాళ్ళు
వాట్సాప్ నెంబర్ ని హ్యాక్ చేసి ఆ నెంబర్ ద్వారా సదరు వ్యక్తికి సంబంధించిన స్నేహితులకు, బంధువులకు తన ఫోన్ నుండి డబ్బులు పంపించడానికి ప్రయత్నం చేస్తే పోవడం లేదని, కాస్త అర్జెంట్ గా ఒకరికి డబ్బులు పంపించాలని, మీరు ఏమైనా పంపించగలరా అంటూ మెసేజ్ పెడుతున్నారు. మెసేజ్ కి రెస్పాండ్ అయితే 40 వేల రూపాయలు పంపించాలని, జీపే చెయ్యమని డీటెయిల్స్ పెడుతున్నారు.

అనుమానం వస్తే ఇలా చెయ్యండి
అయితే అసలు వ్యక్తికి కాల్ చేసి కన్ఫామ్ చేసుకోకుండా డబ్బులు పంపించవద్దని సైబర్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు పెరిగాయని, whatsappకి వచ్చే మెసేజ్ ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని, అటువంటి నంబర్స్ కు డబ్బులు పంపించేందుకు ట్రై కూడా చేయకూడదని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే వెంటనే రిపోర్ట్ చేసి నంబర్ కు బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు.

సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయండి
ఎవరికైనా సరే ఇటువంటి హ్యాకింగ్ జరిగితే తక్షణం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి నష్టం జరగకుండా నివారించాలని సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి 1930 నెంబర్ కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. పొరపాటున కూడా ఇటువంటి మెసేజ్ లను నమ్మి, నిజంగానే మనవారు చేశారన్న ఉద్దేశంతో డబ్బులు పంపించ కూడదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+