బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన సమంత?
కథానాయిక సమంత ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. న్యూయార్క్ లో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్ అందాలను ఆస్వాదిస్తూ ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తాను దిగిన ఫొటోలను అప్ లోడ్ చేస్తూ అందరితోను పంచుకుంటుంది. ఏ దేశం వెళ్లినా, ఏ ప్రాంతం వెళ్లినా తాను వదిలిపెట్టని విషయం ఒకటుంటుంది. అదే జిమ్. వ్యాయామం చేయడం మాత్రం మానదు. తాను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ జిమ్ లో మాత్రం చెమటోడుస్తూ ఉంటుంది.. అలాగే తన ఫిజిక్ ను కూడా కాపాడుకుంటుంది.

తాజాగా సమంత ఒక ఫొటోను షేర్ చేసింది. జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఫొటో అది. అయితే ఆ ఫొటోలో సామ్ పక్కనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు పూర్తిగా అటువైపు తిరిగివున్నాడు. తన ముఖం కనిపించంలేదు. అతనెవరనేది మిస్టరీగా మారిపోయింది. నెటిజన్లు ఆ వ్యక్తి ఎవరా అంటూ సెర్చింగ్ ప్రారంభించారు. సమంత రెండో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అతనే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సామ్ పక్కనే ఉన్న మిస్టరీ వ్యక్తి ఎవరో మనకు తెలియాలంటే సమంత చెప్పేంతవరకు వేచిచూడాల్సిందే.

నాగచైతన్యతో ప్రేమ, తర్వాత వివాహం చేసుకోవడం, ఆ తర్వాత విడిపోవడం లాంటి సంఘటనలు సమంత జీవితంలో చోటుచేసుకున్నాయి. తాజాగా ఏడాది పాటు షూటింగ్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతోపాటు తనకు అడ్వాన్స్ లిచ్చిన అమౌంట్ ను సామ్ నిర్మాతలకు తిరిగిచ్చేసింది. మయోసైటిస్ కు పూర్తిగా చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకుంది.












Click it and Unblock the Notifications