ఆ హీరోను టార్గెట్ చేసింది ఎవరు?

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా చిత్రమైనది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినీ పరిశ్రమలన్నీ ఒక ఎత్తయితే.. తెలుగు సినీ పరిశ్రమది మరో ఎత్తు. ఇక్కడ ఉండే రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తుల మధ్య కొద్దిరోజులు తిరిగితే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సులువుగా బతికేయొచ్చనే నానుడి కూడా ఉంది. అటువంటి పరిశ్రమలో ఒకరికి మరొకరు టార్గెట్ అవుతూనే ఉంటారు.

తెరవెనక ప్రచారం : పరిశ్రమలో కొందరు... కొంతమంది నటుల సినిమాలపై పడుతుంటారు. ఆ సినిమా హిట్టయితే వారికి స్టార్ హీరోగా గుర్తింపు వస్తుందని, అలా ఎదగకుండా ఉండేందుకు తెరవెనక ప్రచారం చేస్తుంటారు. వీరు అనుకున్న వారి సినిమాలేవీ ఆడకూడదు. ఎందుకంటే ఆడితే వారు స్టార్ హీరోలవుతారు.. అందుకని. తెలుగులో అగ్ర కథానాయకుడిగా చెలామణి అయ్యే అతనిమీద కొందరు నిత్యం వ్యతిరేక భావంతోనే ఉంటారు. ఎందుకంటే తమవల్ల కానిది.. అతను స్టార్ హీరో అయ్యాడు అనే ఒకే ఒక్క పాయింట్ ను పట్టుకుంటారు.

who targeted star hero in telugu film industry

పబ్లిక్ గా సలహాలు : వీరు మాట్లాడేటప్పుడు కూడా పాయింట్ ఔట్ చేస్తారు. ఒక దర్శకుడికి ఒక హీరోగారు పబ్లిక్ గా కొన్ని సలహాలిచ్చారు. ఆ స్థాయిలో ఉండి మీరు సలహాలివ్వడం ఏమిటని, అవి తీసుకోలేదని బాధపడటం దేనికంటూ విమర్శలు వచ్చాయి. దర్శకుణ్ని తన పని తాను చేసుకోనివ్వాలని, జోక్యం ఎందుకని ప్రశ్నించారు. తాజాగా జైలర్ సక్సెస్ మీట్ జరిగింది. ఆ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ దర్శకుడు నెల్సన్ ను తక్కువచేసి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ను ని హైప్ చేశాడు. కానీ అక్కడున్న ఎవరు కూడా దాన్ని నెగిటివ్ గా తీసుకోలేదు.. నెగిటివ్ గా ఎవరూ ప్రచారం చేయలేదు. రజనీకాంత్ చెప్పిందాంట్లో వాస్తవం ఉంది అని అంగీకరించారు. అదే మన తెలుగులో అయితే దాన్నిఇప్పటికే అనేక రకాలుగా భీభత్సమైన ప్రచారం చేసేవారు. మిగతా పరిశ్రమలకు, తెలుగు పరిశ్రమకు తేడా అదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+